16 security personnel killed in IED blast by Maoists మావోయిస్టుల ఘాతుకం.. ఐఈడీ పేలుడు.. 16 మంది జవాన్ల మృతి

15 security personnel driver killed in maoist attack in maharashtra

Maoists, Gadchiroli, naxals blasts, improvised explosive device, maoists, Gadchiroli Blast, attacks, vehicles torched, maharashtra, Gadchiroli district, Gadchiroli, commandos killed, anti maoist squad, Latest news, Maharashtra Politics

At least 16 jawans of C-60, an anti-Maoist squad of Gadchiroli police, were killed in a powerful landmine blast on Wednesday on Dadapur Road in Gadchiroli district, Maharashtra.

మహారాష్ట్రలో మావోయిస్టుల ఘాతుకం.. ఐఈడీ పేలుడు.. 16 మంది జవాన్ల మృతి

Posted: 05/01/2019 03:47 PM IST
15 security personnel driver killed in maoist attack in maharashtra

మహారాష్ట్రలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. రాష్ట్రంలోని గడ్చిరోలీ జిల్లాకు చెందిన భద్రతా సిబ్బందితో వెళ్తున్న రెండు వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని అత్యంత శక్తివంతమైన ల్యాండ్ మైన్ పేల్చారు. నక్సల్స్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో 15 మంది యాంటీ మావోయిస్టు స్వాడ్ పోలీసులతో పాటు వాహన డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు తీవ్రతకు వాహనం తునాతునకలైంది. కురికెడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయాలైన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను తరలిస్తున్నారు.

పేలుడు అనంతరం నక్సల్‌ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో ఇరువర్గాల మధ్య ఎన్ కౌంటర్‌ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి పురాందా-మాలేగావ్‌-యెర్కడ్‌ జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం వినియోగిస్తున్న 36 వాహనాలకు నక్సల్స్‌ నిప్పుపెట్టారు. ఈ నిర్మాణ పనులను అమర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అనే సంస్థ చేస్తోంది. ఈ కంపెనీకి దాదాపూర్ లో దాదర్‌ ప్లాంట్‌ ఉంది. రోడ్డు నిర్మాణం కోసం వినియోగిస్తున్న వాహనాలను ఈ ప్లాంట్లోనే నిలిపి ఉంచారు.

ఈ ప్లాంట్లోకి మావోయిస్టులు చొరబడి వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో రూ. 10కోట్ల మేర ఆస్తి నష్టం వాటిలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ‘మహారాష్ట్ర దినోత్సవం’ జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ దాడి వార్తలు తెలుసుకున్న పోలీసులు కంపెనీకి వెళ్లే సమయంలో మావోయిస్టులు ఇలాంటి దాడులకు పాల్పడటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీజీపీ, గడ్చిరోలి ఎస్పీతో తాను టచ్ లో ఉన్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ కూడా ఈ ఐఈడీ బాంబుల దాడిని తీవ్రంగా ఖండించారు. మావోయిస్టులు దేశ భద్రతకు విఘాతంగా తయారయ్యారని అన్నారు. దేశ భద్రతను అంతర్గతంగా కాపాడుతున్న పోలీసుల మరణాలపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడిలో అమరులైన పోలీసులకు ఆయన తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరవలేమని అన్నారు. అమరజవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కాగా మావోల దాడులు గత ఏడాది ఏప్రిల్ 22న 40 మంది మావోయిస్టులను పోలీసులు కాల్చివేసిన ఘటనకు ప్రతీకారంగానే జరిగినట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles