MHA issues notice to Rahul Gandhi on his nationality రాహుల్ గాంధీకి నోటీసులు.. పక్షం రోజుల్లో వివరణకు అదేశం

Mha issues notice to rahul gandhi over his british citizenship

lok sabha elections 2019, lok sabha polls 2019, elections 2019, election updates, lok sabha polling, lok sabha elections voting, second phase of lok sabha elections, Phase 2 Election 2019, lok sabha elections phase 2 voting, lok sabha, Rahul Gandhi citizenship, subramanian swamy, bjp, narendra modi, Elections, politics

The Home Ministry has served a notice to Congress President Rahul Gandhi, asking him to clarify within a fortnight his "factual position" on a complaint questioning his citizenship status.

రాహుల్ గాంధీకి నోటీసులు.. పక్షం రోజుల్లో వివరణకు అదేశం

Posted: 04/30/2019 03:43 PM IST
Mha issues notice to rahul gandhi over his british citizenship

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం చెలరేగింది. అమేథీలో నామినేషన్ దాఖలు చేసిన సమయంలో రాహుల్ పౌరసత్వానికి సంబంధించిన అంశం తెరమీదకు వచ్చింది. రాహుల్ గాంధీ బ్రిటన్, భారత్.. రెండు దేశాల పౌరసత్వాలు కలిగి ఉన్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. రాహుల్ విన్సీ పేరున్న సర్టిఫికెట్లను ఈసీకి సమర్పించారు. దీంతో రాహుల్ గాంధీకి కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా పౌరసత్వంపై వివరణ ఇవ్వాలని రాహుల్ ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.

అమేథీలో నామినేషన్ దాఖలు సమయంలో రాహుల్ ఇచ్చిన అఫిడవిట్ లో రాహుల్ విన్సీ అనే పేరుతో ఉన్న విద్యార్హత సర్టిఫికెట్లను ఈసీకి సమర్పించారని అరోపించిన బీజేపి నేత సుబ్రహ్మణ్యస్వామి.. దీని ఆధారంగా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. రాహుల్‌ గాంధీకి నాలుగు పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని, ఒకదానిపై ఆయన పేరు రౌల్‌ విన్సీ, క్రిస్టియన్ గా నమోదైందని సుబ్రహ్మణ్య స్వామి తన ఫిర్యాదులో ఆరోపించారు. రాహుల్‌ పౌరసత్వంపై అమేథిలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన ధ్రువ్‌ లాల్‌ సైతం ఈసీకి ఫిర్యాదు చేశారు.

బ్రిటన్ లో రిజిస్టర్ అయిన ఓ కంపెనీ డైరెక్టర్ గా రాహుల్ గాంధీ ఉన్నారని.. 2005-06లో కంపెనీ యాన్వుల్ రిటర్న్స్ ఫైల్ చేసిన సమయంలో రాహుల్‌ గాంధీ తనని బ్రిటన్‌ పౌరుడిగా ప్రకటించుకున్నారని ధ్రువ్‌లాల్‌ వెల్లడించారు. ఈ మేరకు ధ్రువ్‌లాల్‌ న్యాయవాది రవిప్రకాష్‌ హోంశాఖకు పౌరసత్వం విషయమై ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భారతీయులు కాని వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే విషయాన్ని న్యాయవాది రవిప్రకాష్ వెల్లడించారు. దీంతో ఈ విషయంలో పక్షం రోజుల వ్యవధిలో తన వివరణ ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది.

అయితే రాఫెల్ కుంభకోణంపై దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాఖలైన రివ్యూ పిటీషన్ పై ఇవాళ విచారణ జరుగనున్న నేపథ్యంలో దానిపై నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపి పార్టీ, ప్రభుత్వం కలసి ఈ నోటీసులకు తెరలేపాయని కాంగ్రెస్ అరోపిస్తుంది. ఇక కీలకమైన అమేధీ పార్లమెంటుకు ఐదవ విడతలో బాగంగా ఎన్నికలు జరగనున్నాయని.. ఇక్కడ రాహుల్ ప్రచారాన్ని అటంకాలు సృష్టించేందుకు కేంద్రం ఈ ఎత్తుగడ వేసిందని కాంగ్రెస్ శ్రేణులు అరోపిస్తున్నారు.

ఇది చాలదన్నట్లు మరో రెండు విడతల ఎన్నికలకు మరెన్నో కుయుక్తులు పన్నుతారని, అవసరమైతే మరోమారు సానుభూతి వ్యాఖ్యలు కూడా చేస్తారని కాంగ్రెస్ నేతలు అరోపిస్తున్నారు. గుజరాత్ ఎన్నికలలో ఓటమి అంచునుంచి తప్పించుకునేందుకు ప్రధాని మోడీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై హత్యాయత్నారోపణలు కూడా చేశారని.. బీజేపి ప్రభుత్వం చెప్పే నిజాలు ఎలా వుంటాయో కూడా దీన్ని బట్టి తెలిసిపోతుందని ఆయన అన్నారు. ఇక దేశంలో యువత ఉపాధి సహా గత ఎన్నికల హామీలను ఎక్కడ అడుగుతారోనని బీజేపి ఇలాంటి కుయుక్తులకు తెరలేపిందని కాంగ్రెస్ నేతలు అరోపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Rahul Gandhi citizenship  subramanian swamy  bjp  narendra modi  Elections  politics  

Other Articles