Cyclone Fani to intensify further అతి తీవ్ర తుఫాను అలెర్ట్: పూరీ వద్ద తీరం దాటనున్న ‘ఫణి’..

Cyclone fani strengthens twice to become very severe cyclonic storm

IMD, Andhra cyclone alert, TN cyclone alert, cyclone alert tn, IMD cyclone alert, Andhra storm, tn storm, puducherry storm, pondicherry weather, pondicherry storm alert, Andhra Pradesh, Politics

In view of cyclone storm Fani intensifying into a ‘Severe Cyclonic Storm’ over the south-east and adjoining south-west Bay of Bengal, the Eastern Naval Command (ENC) is on high alert to render necessary humanitarian assistance

అతి తీవ్ర తుఫాను అలెర్ట్: పూరీ వద్ద తీరం దాటనున్న ‘ఫణి’..

Posted: 04/30/2019 02:56 PM IST
Cyclone fani strengthens twice to become very severe cyclonic storm

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలాన్ని పుంజుకుని వాయుగుండంగా, అటునుంచి తుపాను, పెను తుఫానుగా రూపాంతరం చెందిన ఫణి.. అతితీవ్ర తుఫానుగా మారనుందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 690 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 760 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఫణి తుపాను, మరికొన్ని గంటల్లో తీవ్ర పెనుతుఫానుగా మారనుంది. కాగా ఇది మే నెల 3న ఒడిశాలోని పూరి వద్ద తీరాన్ని దాటనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఒడిశాలో ఇప్పటికే డిసాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కు చెందిన 20 బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ 12 యూనిట్లు అప్రమత్తంగా వున్నాయి.

మే 1న తీవ్ర పెను తుఫానుగా మారనున్న ఫణి.. 2 లేదా 3వ తేదీల్లో తీరం దాటుతుందని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమీషనర్ బిష్ణుపంథా సెథీ తెలిపారు. కాగా దీని ప్రభావం ఒడిశా, అంధ్రప్రదేశ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లపై అధికంగా వుంటుందని ఆయన తెలిపారు. ఒరిస్సా రాష్ట్రంలోని పూరీలో ఇది తీరం దాటనుంది. ఆ సయంలో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్తగా నేవీ, ఆర్మీ కూడా అలర్ట్ అయ్యాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయా రాష్ట్రాలతో పాటు సైన్యాన్ని కూడా అప్రమత్తం చేసింది కేంద్రం. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా దింపింది.

ఇందులో భాగంగా ప్రకృతి విపత్తు నిధుల కింద ముందస్తుగానే ఏపీకి రూ.200 కోట్లు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎన్నికల వేళ ఫొని తుఫాన్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో.. ఏపీతో పాటు తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలైన ఒరిస్సా, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు కేంద్రం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి రూ.1,086 కోట్లు విడుదల చేసింది. వీటిలో ఏపీకి రూ.200 కోట్లు, ఒడిశాకు రూ.340 కోట్లు, తమినాడుకు రూ.309 కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.235 కోట్ల నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. తుపాన్ ముంచుకొస్తున్న దృష్ట్యా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని నాలుగు రాష్ట్రాలను ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles