With Perfume on EVM Button, TMC Workers Smell Voters ఈవీఎం బటన్ కు అత్తరు పూసి.. వాళ్లను కనిపెడుతున్న టీఎంసీ..

With perfume on evm button tmc workers smell voters fingers to cross check

BJP, Lok Sabha elections 2019, tmc, trinamool congress, west-bengal-lok-sabha-elections-2019, West Bengal, Politics

The battle between the BJP and the TMC in Bengal’s electoral battle has entered a different sensory realm. With perfume on TMC’s EVM button, the party’s workers were standing at a ‘safe’ distance to ensure that votes were polled in their direction, said reports.

ఈవీఎం బటన్ కు అత్తరు పూసి.. కనిపెడుతున్న టీఎంసీ..

Posted: 04/30/2019 11:32 AM IST
With perfume on evm button tmc workers smell voters fingers to cross check

సార్వత్రిక ఎన్నికలలొ తాము విజయం సాధిస్తామని అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేయడం పరిపాటే. అయితే ఇది కేవలం తమ పార్టీ పట్ల ప్రజల్లో వున్న అంచనాలను భట్టి వారు ధీమా వ్యక్తం చేస్తుంటారు. కానీ నాల్గవ ధశ ఎన్నికలలో మాత్రం టీఎంసీ తమ లెక్కలు అంచనాలు కావని, ఇది ముమ్మాటికీ నిజమని స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఓట్ల లెక్కింపుకు ఇంకా 23 రోజుల వ్యవధి వున్నా అప్పుడే అంత ఘంటాపథంగా ఎలా గెలుస్తామని.. చెబుతున్నారు.? అన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.

అయితే ఇక్కడే అనేక రకాల ఆసక్తికర అంశాలకు ఈ ఎన్నికలు నెలవుగా మారాయని వాటితోనే వారు అంతలా ధీమా వ్యక్తం చేస్తున్నారని కూడా తెలుస్తోంది. తాజాగా, పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లు తమ పార్టీకే ఓటేశారో లేదో గుర్తించేందుకు సరికొత్త పంథా అనుసరించారు. ఈవీఎంలోని తృణమూల్ బటన్ పై అత్తరు పూశారు. ఓటరు లోనికి వెళ్లి తృణమూల్ బటన్ పై నొక్కగానే ఆ అత్తరు వేలికి అంటుకుంటుంది. ఆ ఓటరు బయటికి రాగానే తృణమూల్ కార్యకర్తలు వేలిని వాసన చూసి అత్తరు వాసన వస్తే తమకే ఓటేశారని నిర్ధారించుకున్నారు.

ఒకవేళ ఓటరు వేలు అత్తరు వాసన రాకపోతే మాత్రం తమకు ఓటేయనట్టే లెక్క అని తృణమూల్ కార్యకర్తల భావన. దీనిపై పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాంతాల్లోని ఓటర్ల నుంచి ఫిర్యాదులు అందాయి. అధికార పార్టీ కార్యకర్తల తెలివి చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ మేరకు బీజేపి పార్టీ టీఎంసీ పై అరోపణలు చేస్తోంది. ఎక్కడెక్కడ అత్తరు పూసారని అరోపణలు వస్తున్నాయో అక్కడక్కడ ఎన్నికల రీ కౌంటింగ్ పెట్టాలని కూడా డిమాండ్ చేస్తోంది బీజేపి. మరి దీనిపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles