Inspector suspended for 'harassing' woman అక్కకు అన్యాయం జరిగిందని వెళ్తే.. చెల్లికి సీఐ వేధింపులు

Ci sanyasi naidu suspended for harassing woman

CI S Sanyasi Naidu, Inspector, suspended, harassment, woman, MVP Police Station, Assistant Commissioner Y.V. Naidu, Deputy Commissioner Ravindranath Babu. VISAKHAPATNAM, Andhra Pradesh, Politics, Crime

City police commissioner Mahesh Chandra Laddha has suspended MVP Police Station Inspector S Sanyasi Naidu, for his alleged harassment of a woman, who had come to lodge a complaint.

అక్కకు అన్యాయం జరిగిందని వెళ్తే.. చెల్లికి సీఐ వేధింపులు

Posted: 04/30/2019 12:34 PM IST
Ci sanyasi naidu suspended for harassing woman

మేనమామ చేతిలో తన అక్క మోసపోయిందని.. అతడ్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ పోలిస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన చెల్లికి చట్టం ముసుగులో వున్న కామాంధుడు కాటు వేసే ప్రయత్నం చేశాడు. తన అక్కకు జరిగిన అన్యాయమే తనకు ఎదురువుతుండంతో తెలివిగా అలోచించిన చెల్లి.. కామాంధుడ్ని చర్యలను, మాటలను తన ఫోన్ లో రికార్డు చేసి.. వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బాధితులకు అండగా నిలిచి చట్ట ప్రకారం వారికి కావాల్సిన న్యాయం చేయాల్సిన ఓ కామాంధ కాకిపై పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.

న్యాయం చేయాలంటూ బాధిత అక్కతో పాటు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చెల్లితో అసభ్యంగా వ్యవహరించి అమెను లైంగికంగా వేధించిన సిఐపై ఉన్నతాధికారి వేటు వేశారు. బాధితురాలి పిర్యాదుపై కేసు నమోదు చేయకుండా.. అమె చెల్లితో ‘‘నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావు. మీ అక్క కంటే నువ్వే బాగున్నావు. ఒకసారి బీచ్‌కు వస్తే మాట్లాడుకుందాం. నిన్ను ప్రేమించాలని ఉంది. ఎంతసేపూ మీ అక్క కుటుంబమేనా? నీ గురించి ఆలోచించవా?’’ అంటూ వేధించాడు. సీఐ మాటలను రికార్డు చేసిన యువతి.. పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా దృష్టికి తీసుకెళ్లడంతో సీఐని ఆయన సస్పెండ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా జిమ్మయ్యవలస మండలంలోని లక్ష్మీపురానికి చెందిన పల్లా కృష్ణ కుమారి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తూ ఎంవీపీ కాలనీలో ఉంటోంది. తనను పెళ్లి చేసుకుంటానని అమెను నమ్మించిన అమె మేనమామ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన విజయభాస్కర్ ఆమెను లోబరుచుకున్నాడు. ఆ తరువాత మాట తప్పి.. వేరొకరితో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లి పేరుతో మోసం చేసిన మేనమామపై ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ఈ నెల 27న తన సోదరితో కలిసి పోలిస్ స్టేషన్ కు వెళ్లింది.

తన మేనమేమపై తన పిర్యాదు మేరకు కేసు నమోదు చేయాల్సిన సీఐ సన్యాసి నాయుడు ఆ పని చేయకుండా నాన్చుతూ.. కృష్ణ కుమారి సోదరిని చూసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. తాను అమెను ప్రేమిస్తున్నానని, తనను కూడా ప్రేమించాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. తమ వివరాలన్నీ తెలుసుకుని ఇలా వేధింపులకు గురిచేయడం బావ్యం కాదని అమె కోరినా.. సన్యాసి నాయుడు వినలేదు. దీంతో సీఐ ఫోన్ చేసి మాట్లాడిన మాటలను కాల్ రికార్డింగ్ చేసిన బాధితురాలు విశాఖపట్నం సీపీ మహేశ్ చంద్ర లడ్డాకు ఫిర్యాదు చేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన సీపీ సన్యానినాయుడుపై సస్పెన్షన్ వేటు వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CI Sanyasi Naidu  Inspector  harassment  woman  MVP Police Station  Visakhapatnam  Andhra Pradesh  Crime  

Other Articles