Heat wave continues in Telangana, Youth dies of sunstoke వడగాల్పులతో యువకుడి మృతి.. నిర్మల్ లో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Heat wave continues in telangana youth dies of sunstoke

India Meteorological Department, heat wave, weather-report, warning, summer, heatwave, sun stroke, temperatures, telangana

The Indian Meteorological Department (IMD) said that heat wave continues in Telangana, and the temperatures will be coming down from tuesday. A youth, Rahul (22), died of sunstroke in Nirala village in Jainadh mandal, according to his family members.

వడగాల్పులతో యువకుడి మృతి.. నిర్మల్ లో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Posted: 04/29/2019 11:39 AM IST
Heat wave continues in telangana youth dies of sunstoke

తెలంగాణలో వాతావరణంలో ఇవాళ విచిత్ర పరిస్థితులు కనిపించనున్నాయి. వడగాల్పుల విషయంలో ఇప్పటికే సంకేతాలను ఇచ్చి.. హెచ్చరికలను జారీ చేసిన భారత వాతావరణ కేంద్రం తాజాగా ఇవాళ్లి మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొనింది. కాగా, వర్షాలు కురవని ప్రదేశాల్లో మాత్రం వడగాలులు తమ ప్రభావాన్ని చాటుతాయని కూడా హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుపాను ప్రభావం తెలంగాణపై ఉండదన్న అధికారులు.. మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.

ఇదిలావుండగా తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. యావత్ తెలంగాణ మిప్పులు కోలిమిలా కుతకుత ఉడుకుతోంది. దీనికి తోడు వడగాల్పులు కూడా వీస్తూ తెలంగాణవాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణలోని కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యథిక స్థాయికి చేరుకున్నాయి. నిర్మల్ జిల్లాలో క్రితం రోజున గరిష్టంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మంచిర్యాల, కుమరంభీమ్ అసిఫాబాద్ లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

జైనాథ్ మండలంలోని నిరాల గ్రామానికి చెందిన రాహుల్ అనే 22 ఏళ్ల యువకుడు వడదెబ్బతో మరణించిన ఘటన కూడా తెలంగాణలో నమోదైంది. ఉష్ణోగ్రతలు మంగళవారం రోజు నుంచి కొంత తగ్గుతాయని అధికారులు చెబుతున్నా.. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని, ఎండలో వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంతో అవసరమైతే తప్ప ఎండలో బయటకు రావొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సి ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles