EC changes Janasena symbol for telangana MPTC elections తెలంగాణ ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేనకు బ్యాట్ గుర్తు..!

Ec changes janasena symbol for telangana mptc elections

pawan kalyan, janasena, Pawan Kalyan Telangana local elections, Pawan Kalyan TS parishat elections, Janasena ZPTC elections, Janasena MPTC Elections, Janasena glass tumbler, janasena cricket bat, janasena Telanagana assembly polls symbol bat, JanaSena,MPTC symbol Bat, Cricket Bat, ZPTC Glass Tumbler, Telangana, politics

This is big shock to janasena activists as the election commission changes party smybol from glass tumbler to cricket bat fot MPTC Elections in Telangana local body elections.

తెలంగాణ ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేనకు బ్యాట్ గుర్తు..!

Posted: 04/25/2019 12:17 PM IST
Ec changes janasena symbol for telangana mptc elections

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తవడంతో తెలంగాణపై కన్నేసింది జనసేన. తెలంగాణలో పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టిన పవన్ కల్యాణ్.. కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహం నింపేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి పచ్చ జెండా ఊపారు. దీంతో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల రణరంగంలోకి జనసేన దిగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమవుతోంది. జనసేన తరపున అభ్యర్థుల్ని రంగంలోకి దింపుతోంది. స్థానిక నాయకత్వం ఇప్పటికే అభ్యర్థుల్ని ఎంపికచేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణవ్యాప్తంగా కసరత్తును మొదలు పెట్టినట్లు సమాచారం.

రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పోటీచేస్తుండడంతో ఆ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తులను ఖరారుచేసింది. ఇక్కడే కీలకమైన మార్పును చేసింది ఎన్నికల సంఘం. జనసేన జెడ్పీటీసీ ఎన్నికలకు పార్టీ గుర్తు గాజు గ్లాసునే కేటాయించినా.. ఎంపీటీసీ ఎన్నికకు మాత్రం గుర్తును మార్చేసింది. ఎంపీటీసీ అభ్యర్థులు మాత్రం ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటుంది. జనసేన తరపున బరిలో నిలుస్తున్న ఎంపీటీసీ అబ్యర్థులకు పార్టీ గుర్తుగా క్రికెట్ బ్యాట్ ను ఈసీ కేటాయించింది. ఎంపీటీసీలో గ్లాస్ గుర్తు లేనందును బ్యాట్ గుర్తు కేటాయించినట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

అయితే ఈ విషయాన్ని జనసేన ఎంపీటీసీ అభ్యర్థులు తప్పక గుర్తుపెట్టుకోవాలని, ఈ విషయాన్ని ప్రజల్లోకి కూడా బలంగా తీసుకెళ్లాలని జనసేన అభ్యర్థులకు తెలిపింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ గుర్తులు కాస్త మారాయంటోంది జనసేన. ఈ మార్పును గమనించాలంటూ పార్టీ తరపున ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. జెడ్పీటీసీ ఎన్నికలకు గాజు గ్లాసు గుర్తుగా ఉంటుందని.. అయితే ఎంపీటీసీ ఎన్నికలకు మాత్రం బ్యాటు గుర్తు ఉంటుందని తెలిపింది. ఎంపీటీసీకి గ్లాస్ గుర్తు లేనందున బ్యాట్ గుర్తు కేటాయించారని తెలిపింది. గుర్తు విషయంలో మార్పును గమనించాలని జనసేన చెబుతోంది.

జనసేన ట్వీట్‌లో ‘ZPTC : Glass Tumbler ( గాజు గ్లాసు)

MPTC : Bat (బ్యాట్)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  MPTC symbol Bat  Cricket Bat  ZPTC Glass Tumbler  Telangana  politics  

Other Articles