Set back to konda vishsweshar reddy in nampally court నాంపల్లి కోర్టులో కొండా విశ్వేశ్వర్ రెడ్డికి చుక్కెదురు..

Nampally court rejects anticipatory bail of konda vishweshwar reddy

Konda Vishweshwar Reddy, Congress, Nampally Court, Rejected Bail, Anticipatory bail, Banjara Hills police station, Telangana

The Nampally Court rejected the Anticipatory bail petition of Congress leader Konda Vishweshwar Reddy on Thursday. As his bail petition is rejected he has to appear for an enquiry before the Banjara Hills police where a Sub- Inspector and a Head Constable filed complaints.

నాంపల్లి కోర్టులో కొండా విశ్వేశ్వర్ రెడ్డికి చుక్కెదురు..

Posted: 04/25/2019 12:59 PM IST
Nampally court rejects anticipatory bail of konda vishweshwar reddy

కాంగ్రెస్ నేత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. దీంతో ఆయనను తక్షణం అదుపులోకి తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఆయన తరపు న్యాయవాదులు మాత్రం హైకోర్టు తలుపు తట్టుతామని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన ఈసీ, పోలీసులు కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే ఈ కేసును బనాయించారని అరోపిస్తున్నారు. ఎన్నికల నియమావళి అమల్లో వున్న క్రమంలో ఎవరైనా పోలీసులను ఎదురిస్తారా..? వారిని అక్రమంగా బంధిస్తారా.? ఇది కుట్రతో వేసిన కేసు అని పేర్కోంటున్నారు.

కాగా, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన గచ్చిబౌలి ఎస్‌ ఐ, హెడ్ కానిస్టేబుల్ ను నిర్బంధించారన్న అభియోగాలపై ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన దరఖాస్తు చేసుకోగా.. ఆయన సమర్పించిన పిటీషన్ పై నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను నాంపల్లి న్యాయస్థానం కొట్టేసింది. దీంతో ఆయన్ని ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

కొండా విశ్వేశ్వర్‌రెడి చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేశారు. ఎన్నికలకు రెండ్రోజుల ముందు ఆయన బంధువు, అడ్వకేట్ సందీప్‌రెడ్డి రూ.10లక్షలు కారులో తరలిస్తూ హైదరాబాద్ లో పోలీసులకు పట్టుబట్టారు. ఈ డబ్బు విశ్వేశ్వర్‌రెడ్డిదని, ఓటర్లకు పంపిణీ చేసేందుకు తరలిస్తున్నట్లు తేలడంతో పోలీసులకు ఆయనకు నోటీసులు జారీచేశారు. నేరుగా నోటీసులు అందించేందుకు గచ్చిబౌలి ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ ఆయన నివాసానికి వెళ్లగా వారిద్దరినీ కొండా అనుచరులు నిర్బంధించారు.

ప్రభుత్వాధికారుల విధులకు భంగం కలిగించినందుకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీచేశారు. దీనికి తోడు వారం రోజులుగా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. దీంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ కొట్టేసింది. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles