Congress takes black Trunk box complaint to EC ప్రధాని హెలికాప్టర్ నుంచి అనుమానాస్పద ట్రంకు పెట్ట.. ఈసీకి పిర్యాదు..

Suspicious black trunk in pm modi s helicopter congress files complaint to ec

2019 Lok Sabha Polls, Narendra Modi, anand sharma, 2019 Lok Sabha Elections, elections in India, Congress, BJP, Karnataka unit, Politics

The Congress has alleged that PM Modi's helicopter transported a suspicious black trunk and whisked away in a private car, during his visit to Karnataka's Chitradurga earlier this week.

ITEMVIDEOS: ప్రధాని హెలికాప్టర్ నుంచి అనుమానాస్పద ట్రంకు పెట్ట.. ఈసీకి పిర్యాదు..

Posted: 04/15/2019 12:27 PM IST
Suspicious black trunk in pm modi s helicopter congress files complaint to ec

సాక్ష్యాత్తు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తన కారులోనే ఓటర్లకు పంచేందుకు డబ్బులు పెట్టుకుని వెళ్తూ.. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు ఆయన కారును తనిఖీ చేసి అక్షరాలా రెండు కోట్ల రూపాయలను స్వాధినం చేసుకున్న ఘటన మరువక ముందే.. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారు. ఆయన గత వారం కర్నాటకలోని చిత్రకోట్ ప్రాంతానికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన క్రమంలో జరిగిన ఓ పరిణామాంపై కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల సంఘాన్ని తక్షణం సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా కోరారు.

అసలేం జరిగింది.. కాంగ్రెస్ నేతలు ఎందుకని ప్రధాని నరేంద్రమోడీపై పిర్యాదు చేశారంటే.. ఎన్నికల నియమావళి అమల్లో వున్న క్రమంలో కార్ణాటకలోని చిత్రకోట్ ప్రాంతానికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన ప్రధాని.. తనతో పాటు హెలికాప్టర్ లో భారీ ట్రంకుపెట్టెను తీసుకురావడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. ఇద్దరు వ్యక్తులు, ఈ ట్రంకుపెట్టెను తీసుకెళ్లి ఓ కారులో పెట్టగా, అది వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ కారు ఎక్కడికి వెళ్లిందన్న విషయం తెలియరాకపోగా, ఈ దృశ్యాలను ప్రధాని పర్యటనను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా చిత్రీకరించగా, ఈ పెట్టెలో భారీ ఎత్తున డబ్బులు తెచ్చారని, ఎన్నికలను ప్రభావితం చేసేందుకే తెచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ఈ ఘటనపై ప్రధాని వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. మోదీ చాపర్ కు రక్షణగా మరో 3 చాపర్లు ఇక్కడికి వచ్చాయని, అవి ల్యాండయిన తరువాత, ఓ చాపర్ నుంచి ఈ పెట్టెను దించి తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు. ఈ ఇన్నోవా కారు ప్రధాని కాన్వాయ్ కి సంబంధించినది కాదని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్న మోదీ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Black Trunk Box  Narendra Modi  anand sharma  election commission  Congress  BJP  Karnataka unit  Politics  

Other Articles