Rabri devi dropped a bombshell on prashant kishor ప్రశాంత్ కిషోర్ పై బాంబు పేల్చిన మాజీ సీఎం

Rabri devi dropped a bombshell on strategist prashant kishor

rabri devi dropped a bombshell on Prashant kishor, rabri devi sensational comments, rabri devi sensational statements on prashanth kishor, RJD, Rabri Devi, Prashant Kishore, Lalu Prasad Yadav, Nitish kumar, JD (U), BJP, Bihar, politics

Former bihar chief minister Rabri devi dropped a bombshell claiming that strategist prashant kishor had visited them more than five times and even had talks with RJD chief Lalu prasad Yadav for tieup in parliament elections.

ప్రశాంత్ కిషోర్ పై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

Posted: 04/13/2019 06:59 PM IST
Rabri devi dropped a bombshell on strategist prashant kishor

ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ పై బీహార్ మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఆర్జేడీని జేడీయూలో విలీనం చేయాలంటూ ప్రతిపాదించినట్టు ఆమె తెలిపారు. ఈ మేరకు తన భర్తను లాలూను ప్రశాంత్ కిశోర్ గతంలో కలిసినట్లు రబ్రీ వెల్లడించారు. జేడీయూ, ఆర్జేడీలు కలిసి కొత్త పార్టీని ఏర్పాటు చేసి, లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని కూడా కిశోర్‌ సూచించాడని ఆమె పేర్కొన్నారు.

అయితే మహాఘట బంధన్‌గా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బీహార్ రాష్ట్రంలో మరోమారు అధికారంలోకి వచ్చిన నీతీశ్‌ కుమార్.. ఆ తరువాత తమతో విభేధించి బీజేపితో చేయికలిపి పెద్ద డ్రామాకే తెరతీసిన క్రమంలో ఆయన చేసిన నమ్మకద్రోహం మరిచిపోలేదని లాలూ ప్రసాద్ యాదవ్.. ప్రశాంత్ కిషోర్ పై పట్టరాని కోపంతో వెళ్లిపొమ్మని చెప్పినట్లు రబ్రీ తెలియజేశారు. బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి మహాఘట బంధన్‌గా ఏర్పడిన అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

ప్రశాంత్‌ కిశోర్‌ తమను అనేక సందర్భాల్లో కలిసినట్టు కూడా ఆర్జేడీ జాతీయ వైస్ ప్రెసిడెంట్ రబ్రీ వెల్లడించారు. తేజస్వీ యాదవ్ బంగ్లాతోపాటు తమ నివాసానికి పీకే కనీసం ఐదుసార్లు వచ్చాడని, ఈ విషయం తమ సిబ్బంది, సెక్యూరిటీకి కూడా తెలుసని రబ్రీ ఉద్ఘాటించారు. పార్టీ విలీనం ప్రతిపాదనలతోనే ప్రశాంత్ కిశోర్ ను నీతీశ్‌ కుమారే పంపారని, పట్టపగలే తమ ఇంటికి అతడు వచ్చాడని ఆమె ఆరోపించారు. జైలులో ఉన్న తన భర్త లాలూతో కిశోర్‌ పలుమార్లు మాట్లాడినట్లు ఆమె తెలిపారు.

సన్నిహితులైన లాలూ యాదవ్, నితీష్ ఎలా విడిపోయారంటే..

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జయప్రకాశ్‌ నారాయణ్ చేసిన పోరాటంలో మిత్రులైన లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్‌ కుమార్‌లు చురుకుగా పాల్గొన్నారు. ఆయనకు సన్నిహితులుగా మెలిగిన లాలూ, నితీశ్‌లు 90వ దశకం మధ్యలో అభిప్రాయ భేదాలతో విడిపోయారు. బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న సోషలిస్ట్ పార్టీ నాయకుడు కర్పూరీ ఠాకూర్ 1989లో చనిపోయిన తర్వాత ఆ స్థానంలో లాలూను ఎన్నకున్నారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ లాలూను అపర చాణక్యుడిగా నితీశ్ కుమార్ ప్రశంసలు కురిపించారు.

అయితే, 1994లో ఓబీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జరిగిన పోరాటంలో విభేదాలు రావడంతో నితీశ్ జనతాదళ్ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం జార్జ్ ఫెర్నాండేజ్ తో కలిసి సమతా పార్టీ ఏర్పాటు చేశారు. లాలూ కూడా 1997లో జేడీ నుంచి బయటకు వచ్చి ఆర్జేడీని స్థాపించి, అదే ఏడాది ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, దాణా కుంభకోణంలో ఆరోపణలు రావడంతో సీఎం పదవి నుంచి తప్పుకుని ఆ స్థానంలో భార్య రబ్రీదేవిని కూర్చోబెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RJD  Rabri Devi  Prashant Kishore  Lalu Prasad Yadav  Nitish kumar  JD (U)  BJP  Bihar  politics  

Other Articles