Chandrababu holds dharna in front of CEO office ఈసీపై చంద్రబాబు అసహనం.. మెరుపు ధర్నా..!

Andhra cm chandrababu naidu holds dharna in front of ceo office

Chandrababu Naidu, Chandrababu Naidu dharna, A.P. CEO, 2019 General Elections, General Elections 2019, Lok Sabha Elections, 2019 Lok Sabha Elections, AP Assembly Election 2019, Election Commission, CEO, Amaravati, Andhra pradesh, politics

In a dramatic development, TDP president and CM Chandrabab staged a demonstration at the CEO's office at the Interim Government Complex in Amaravati, after submitting a representation to CEO, deploring the unilateral conduct of the Election Commission.

ఈసీపై చంద్రబాబు అసహనం.. మెరుపు ధర్నా..!

Posted: 04/10/2019 05:41 PM IST
Andhra cm chandrababu naidu holds dharna in front of ceo office

ఎన్నికల సంఘం తీరుకునిరసనగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్నా చేపట్టారు. ఈసీ తీరుపై ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి తన ప్రతినిధులను ఢిల్లీ  పంపిన చంద్రబాబు బుధవారం అమరావతి లోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కూడా కలిసి వినతి పత్రం అందచేశారు. అనంతరం ఆఫీసు బయటకు వచ్చి ధర్నా చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమీషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అరోపించారు.

ఈసీ కార్యాలయం బీజేపీ ఆఫీసులా మారింది. ప్రధాని మోడీ ఏం చెప్తే అది ఎన్నికల సంఘం చేసే పరిస్ధితి వచ్చిందని వ్యాఖ్యానించారు. "ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోటానికి .సీనియర్ పోలిటిషియన్ గా నేనే వచ్చాను, నిరసన తెలుపుతున్నానని చంద్రబాబు అన్నారు.  ఈ నిరసన వల్ల నైనా ఎన్నికల కమీషన్ లో మార్పు వస్తుందను కుంటున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసీ లో మార్పు వచ్చేంత వరకు  ప్రజాస్వామ్యవాదులంతా ఎక్కడి కక్కడ వత్తిడి తేవాలని, నిరసన  తెలియ చేయాలని బాబు కోరారు. ఎవరైతే  ప్రజాస్వామ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారో వారికి బుద్ది చెప్పాలని ఆయన అన్నారు.

అంతకుముందు ఎన్నికల సంఘం అధికారులపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన కూడా పోరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు చెప్పినట్లుగా అడుతుందని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘానికి వున్న స్వతంత్ర ప్రతిపత్తి కేవలం రాజ్యంగంలోని పేజీలకే పరిమితం అయ్యిందని ఆయన మండిపడ్డారు. ఈసీ స్వతంత్రతకు కూడా బ్రేకులు పడటం విడ్డూరంగా వుందన్నారు.

కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, వైసీపీ చెప్పినట్టు ఎన్నికల సంఘం నడుచుకుంటోందని, టీడీపీ నేతలను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరుని బాబు తప్పుపట్టారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదిని కలిసిన చంద్రబాబు.. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులను ఇష్టానుసారంగా ట్రాన్స్ ఫర్ చేస్తున్నారని మండిపడ్డారు. అర్థరాత్రి బదిలీలపై సీరియస్ అయ్యారు.

ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికల అధికారిని కలవడం ఇదే తన రాజకీయ జీవితంలో తొలిసారని చంద్రబాబు అన్నారు. అధికారులను బదిలీ చేసే అధికారం ఈసీకి ఎవరిచ్చారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏ తప్పు చేయని అధికారులను, వెరిఫై చెయ్యకుండానే ఎలా ట్రాన్సఫర్ చేస్తారని అడిగారు. వైసీపీ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రధాని మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికల అభ్యర్థులపై ఐటీ దాడులు చేయొద్దని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. జగన్ డైరెక్షన్ లో మోడీ పని చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సహా 22 పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశాయని, ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్లు వాడాలని కోరాయని, ఈసీ పట్టించుకోలేదని చంద్రబాబు చెప్పారు. 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కింపునకు 6 రోజుల సమయం పడుతుందని సీఈసీ సుప్రీకోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Dharna  Election Commission  CEO  Lok Sabha elections 2019  Amaravati  Andhra pradesh  politics  

Other Articles