EC Stops Release of Modi Biopic Till End of Election ‘‘పీఎం నరేంద్రమోడీ’’ చిత్రానికి ఈసీ ఎర్రజెండా..

Disturbs level playing field ec stalls release of pm modi biopic till completion of polls

modi biopic, biopic on pm modi, ec on modi biopic, modi biopic ban, modi biopic release date, pm modi biopic, pm narendra modi movie, prime minister narendra modi, biopic on prime minister narendra modi, vivek oberoi, election commission

The Election Commission of India has stopped the release of ‘PM Narendra Modi’ till the end of the Lok Sabha elections as it banned the screening of all biopics that serve the interests of any political party during the polls.

‘‘పీఎం నరేంద్రమోడీ’’ చిత్రానికి ఈసీ ఎర్రజెండా.. మే 19 తరువాతే..

Posted: 04/10/2019 06:32 PM IST
Disturbs level playing field ec stalls release of pm modi biopic till completion of polls

ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్ర విడుదలకు మరోమారు బ్రేకులు పడ్డాయి. సరిగ్గా ఎన్నికల వేళ.. ఓటర్లను ప్రభావితం చేసేలా వున్న చిత్రాన్ని ఎలా విడుదల చేస్తారంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ చిత్ర విడుదలను ఇవాళ వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేవరకూ సినిమాను విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ చిత్రం వల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కోంది.

దేశసర్వోన్నత న్యాయస్థానం ఈ చిత్ర విడుదలకు పచ్చజెండాను ఊపింది. దీంతో ఎన్నికల వేళ చిత్రం విడుదలవుతుందని, దాంతో తమ పార్టీకి కొంత మైలేజ్ లభిస్తుందని ఆశించిన ఆ పార్టీ వర్గాలకు చుక్కెదురైంది. ఇవాళ చిత్రాన్ని చూసిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు.. ఎన్నికల వేళ ఈ చిత్రం విడుదలైతే.. ఇబ్బందులు ఎదురవుతాయని, అందుకే ఈ చిత్ర విడుదలను వాయిదా వేసుకోవాలన్న నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

పీఎం నరేంద్రమోడీ చిత్రం ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి వుంది. సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఇందులో 11 సన్నివేశాలకు కత్తెర పడింది. విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న సంభాషణల వద్ద బీప్‌ శబ్దం వినిపించనుంది. ఈ చిత్రం విడుదలకు ఈసీ అడ్డు చెప్పడంతో మే 19 తర్వాతే విడుదల కానుంది. అయితే తాజాగా ఈసీ ఆదేశాలను సినిమా విడుదల వాయిదా పడింది. ఈ చిత్రంలో ప్రధాని మోదీ పాత్రలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటించారు. ఒమంగ్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles