chandrababu alleges YS jagan tried to delete votes అదే కుట్ర చేయబోయి జగన్ బొక్కబోర్లాపడ్డాడు: చంద్రబాబు

Chandrababu alleges ys jagan tried to delete votes with kcr support

chandrababu on it grids, chandrababu on data theft, chandrababu on YS Jagan, chandrababu on KCR, Chandrababu Naidu, YS Jagan, KCR, Data Theft, Cyber Crime, IT grids, congress, Telugu states, Andhra pradesh, Telangana, politics

Andhra Pradesh chief Minister Chandrababu alleges YS Jagan too followed the same way of Telangana CM KCR and tried to delete votes of many voters in the state. Police raids and Data theft are a part of this alleged TDP party chief.

అదే కుట్ర చేయబోయి జగన్ బొక్కబోర్లాపడ్డాడు: చంద్రబాబు

Posted: 04/09/2019 01:39 PM IST
Chandrababu alleges ys jagan tried to delete votes with kcr support

తెలంగాణలో అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కుట్రనే ఇక్కడ కూడా చేయాలని భావించి జగన్ బొక్కబోర్లా పడ్డారని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. జగన్ కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకెళ్లిన కేసీఆర్ తాను వేసిన పాచిక ఇక్కడ పారలేదని, ఆ పాచికను జగన్ అందుకోవడంలో బొక్కబోర్లా పడ్డారని తెలుసుకుని మిన్నకుండిపోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓట్లు వేయరని భావించిన 25 లక్షల మంది ఓటర్ల ఓట్లు హక్కును కేసీఆర్ తొలగించారని, అదే కుట్రను ఏపీలో అమలు చేయబోయిన వైఎస్ జగన్, బొక్క బోర్లా పడ్డాడని చంద్రబాబు నిప్పులు చెరిగారు. టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్ పై జరిగిన దాడి జగన్ కోసం కేసీఆర్ చేయించినదేనని మండిపడ్డారు. 'ఎలక్షన్ మిషన్ 2019' టెలికాన్ఫరెన్స్  నిర్వహించిన ఆయన, డేటా సమాచారాన్ని దొంగిలించి జగన్ కు అందించడం సైబర్ నేరమని ఆరోపించారు.

తెలంగాణ ఎన్నికల్లో హోదాను వ్యతిరేకించిన కేసీఆర్, ఇప్పుడు జగన్ కోసం నాటకాలు ప్రారంభించారని అన్నారు. దేశవ్యాప్తంగా మోదీకి ఎదురుగాలులు వీస్తున్నాయని, రాష్ట్రంలోని ప్రజలు మాత్రం టీడీపీ వైపున్నారని అన్నారు. ఎన్నో సర్వేలు ఈ ఎన్నికల్లో ఫలితాలు టీడీపీకి అనుకూలమని చెబుతున్నాయని గుర్తు చేశారు. కడుపు నిండా ద్వేషం నింపుకున్న కేసీఆర్ వంటి వ్యక్తితో కలిసిన జగన్ కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  YS Jagan  KCR  Data Theft  Cyber Crime  IT grids  Andhra pradesh  politics  

Other Articles