BJP to keep off from alliance politics in AP: Ram Madhav జగన్ కేసులు, ఆస్తుల జప్తులపై రామ్ మాదవ్ సంచలన వ్యాఖ్యలు

Bjp to keep off from alliance politics in ap ram madhav

Ram Madhav, YS Jagan, Chandrababu Naidu, Prime MInister, CBI cases, Jagan assets attachments, courts managed, CBI misuse, Proxy, congress, Telugu states, expansion of party in south india, aiadmk, ayyappa swamy temple, karnataka, Andhra pradesh, Telangana, politics

BJP National general secretary Ram Madhav has declared that their party would go alone in Andhra Pradesh hereafter keeping off from the alliance politics and the sole aim was to emerge as the ruling party in the state by 2024.

జగన్ తమతో కలిసివుంటే.. కేసులు, ఆస్తుల జప్తులు జరిగేవా.?: రామ్ మాదవ్

Posted: 04/09/2019 12:45 PM IST
Bjp to keep off from alliance politics in ap ram madhav

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తాము ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తో కుమ్మక్కై.. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నామన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలు సత్యదూరమైనవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. ఏపీ రాజకీయాల్లో బీజేపీ వేలు పెడుతుందని చెప్పడం సహేతుకం కాదని, బీబేపి కూడా ఓ రాజకీయ పార్టీ అని.. తాము కూడా ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తామని, అంతమాత్రాన తమను కార్నర్ చేసి చంద్రబాబు విమర్శలు చేయడమేంటని ఆయన మండిపడ్డారు.

జగన్ ను తామేమీ తమ ప్రాక్సీగా (ప్రతినిధిగా) వినియోగించుకోవడం లేదని, ఆయన ఓ టీవీ చానల్ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఒకవేళ తాము నిజంగానే జగన్ కు అండగా వుండివుంటే.. ఆయన కేసుల విచారణ, ఆయన సంస్థల అస్తుల సీజ్, ఆయన బంధువుల ఆస్తుల అటాచ్ మెంట్ జరిగి ఉండేదా? అని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు విమర్శిస్తున్నట్లుగా తమకెవరూ బీ-టీమ్ లేరని స్పష్టం చేశారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకునే నష్టపోయామని రాంమాదవ్ అన్నారు.

చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు తాము బలైపోయామని, ఇకపై అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా సొంతంగా ఎదిగేందుకు కృషి చేస్తామని అన్నారు. 2024లో తాము సోంతంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామని అన్నారు. జగన్ పై కేసులున్నాయని, అందుకనే ఆయన బీజేపీని ఏమీ అనడం లేదని విమర్శిస్తున్న చంద్రబాబు.. తనపై బీజేపి ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ రోడ్డు మీద ధర్నాలకు దిగుతున్నాడని.. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారని రాం మాదవ్ ఎద్దేవా చేశారు.

ఇన్వెస్టిగేటింగ్ ఏజన్సీల స్వతంత్రతను తాము ఎన్నడూ అడ్డుకోవడం లేదని, వారు చేసే పని వారు చేసుకుంటూ పోతున్నారని, తాము కల్పించుకోవడం లేదని వెల్లడించారు.  సీబీఐ, ఈడీలను బీజేపీ వాడుకుంటోందన్నది తప్పుడు ఆరోపణలని, అలాగే వాడుకుని వుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది జైల్లో ఉండేవారని అన్నారు. గతంలో తప్పులు చేసి ఉండబట్టే చంద్రబాబు ఇప్పుడు భయపడుతున్నారని విమర్శలు గుప్పించారు. తప్పు చేయకుంటే విచారణంటే భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Madhav  YS Jagan  Chandrababu Naidu  CBI cases  assets attachments  Andhra pradesh  politics  

Other Articles