Indian unemployed will teach lesson to modi: mayawati రాష్ట్రం విడిపోయినా తెలంగాణలో అభివృద్ది శూన్యం: మాయావతి

Seperate statehood didnot bring any development in telangana mayawati

pawan kalyan, Mayawati, Bahujana Bheri, Pawan Kalyan speech at LB stadium Bahujana Bheri, Mayawati speech at Bahujana Bheri, LB stadium Bahujana Bheri, TRS, KCR, Dalit CM, Andhra pradesh, Telangana, PM Narendra Modi, janasena, BSP, CPI, CPM, TDP, YSRCP, BJP, Congress, andhra pradesh, politics

Bahujan samaj party chief Mayawati critisizes Ruling TRS party under the leadership of KCR, that seperate statehood did not bring any development to the state or people standard of life.

రాష్ట్రం విడిపోయానా తెలంగాణలో అభివృద్ది శూన్యం: మాయావతి

Posted: 04/04/2019 11:56 PM IST
Seperate statehood didnot bring any development in telangana mayawati

తెలంగాణ‌ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయాక కూడా అభివృద్ధిలో శూన్యంగానే ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన జనసేన-బిఎస్పీ సభలో మాట్లాడిన మాయావతి రాష్ట్రం విడిపోయిందని, అయితే రాష్ట్ర ప్రజల స్థితిగతులలో మాత్రం ఏ మాత్రం మార్పు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.

దేశంలో కాంగ్రెస్-బీజేపీల పాలనలో ఎస్సి, ఎస్టీలకు న్యాయం జరగలేదన్నారు. కాంగ్రెస్ ఇలాంటి పోరబాట్లు చేసి అణగారిన వర్గాలకు దూరంగా జరగడంతో ఆ పార్టీ పలు రాష్ట్రాల్లో అధికారానికి దూరమైందని అన్నారు. ఇక అదే పంథాలో నడుస్తున్న బిజెపికి కూడా రానున్న ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. దేశంలో అభివృద్ది వేగంగా సాధిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపి ప్రస్తుత పాలన అభివృద్ది ఆమడదూరం అన్నట్లు సాగుతుందని ఎద్దేవా చేశారు.

అభివృద్ది విషయంలో ఎన్టీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. నిరుద్యోగులకు ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన పార్టీపై అనేక మంది ఆశలు పెట్టుకున్నారని.. అయితే ఐదేళ్లు పూర్తికావస్తున్నా.. ఇప్పటికీ నిరుద్యోగులు ఎధురుచూపులకు ఇంకా ఎక్కడ వేసిన గొంగల అక్కడే అన్న చందంగా వున్నాయిని అన్నారు. దీనికి తోడు నోట్లరద్దు, జీఎస్టీ వంటి చర్యలతో దేశంలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎపిలో ప్రజలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని.. తెలంగాణలో ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  Mayawati  Bahujana Bheri  LB stadium  Telangana  janasena  BSP  andhra pradesh  politics  

Other Articles