Justice Eeshwaraiah convtroversial remarks on AP politics ఏపీలోని అధికార, విపక్షాలపై మండిపడిన న్యాయమూర్తి

Justice eeshwaraiah convtroversial remarks on chandrababu and ys jagan

Justice Eeshwaraiah, Justice Eeshwaraiah controversial comments, Justice Eeshwaraiah allegations on chandrababu, Justice Eeshwaraiah remarks on YS Jagan, andhra pradesh CM Chandrababu, TDP president chandrababu, Chandrababu Jagan, TDP YSRCP, Chandrababu Jagan controvesial comments, Justice Eeshwaraiah, chandrababu, TDP, YS Jagan, YSRCP, controversial comments, andhra pradesh, politics

Justice Eeshwaraiah convtroversial remarks on Andhra Pradesh Ruling and opposition party. He appeals backward classes not to vote for forward class candidates of Chandrababu and ys jagan.

ఏపీలోని అధికార, విపక్షాలపై మండిపడిన జస్టిస్ ఈశ్వరయ్య

Posted: 04/05/2019 11:54 AM IST
Justice eeshwaraiah convtroversial remarks on chandrababu and ys jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై సంచలన అరోపణలు చేసిన ఆల్ ఇండియా బిసి ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య ఆయన దుమ్ముదులిపారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన ప్రతీ స్కీంలో ఒక స్కాం దాగివుందని చెప్పాన ఆయన.. తన బినామిలీకు వేల కోట్ల రూపాయలను దోచిపెట్టారని అరోపించారు. అమరావితీలోనూ రాజధాని పేరుతో భారీ కుంభకోణం జరిగిందని ఆయన అరోపించిన విషయం తెలిసిందే.

తాజాగా జస్టిస్ ఈశ్వరయ్య ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏమన్నా పతివ్రతా అంటూ విమర్సించారు. జగన్ పైన ఎన్ని కేసులు ఉన్నాయో ప్రజలందరికీ తెలుసునని, జగన్ పై ఉన్న కేసులు చదివి ఆశ్చర్యపోయానని అన్నారు. జగన్ బిసిల ద్రోహని, వైసిపి మేనిఫెస్టో అంతా బూటకమేనన్నారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి బిసిలకు తీవ్ర అన్యాయం జరిగిందని అరోపించారు.

విజయసాయిరెడ్డికి బిసిల రిజర్వేషన్ల గురించి ఏం తెలుసునని, రిజర్వేషన్ ఇస్తామని బిసిలను ఎందుకు మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. శరీరం అమ్ముకున్నవారికి నీతి, విలువ ఉంటుందని, రాజకీయ నాయకులకు ఆ విలువ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రవర్ణాలకు ఓటెయ్యవద్దని బిసిలకు జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. తెలంగాణాలో కెసిఆర్, ఏపిలో చంద్రబాబులు ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని ఆరోపణలు చేసుకుంటుండడం విడ్డూరంగా ఉందని జస్టిస్ ఈశ్వరయ్య ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Justice Eeshwaraiah  chandrababu  TDP  YS Jagan  YSRCP  controversial comments  andhra pradesh  politics  

Other Articles