Prakash Ambedkar threatens to throw EC into jail సీఈపీని రెండు రోజులు జైలులో పెట్టిస్తా: ప్రకాష్ అంబేద్కర్

Will jail ec for two days if voted to power prakash ambedkar

Prakash Ambedkar, Bharipa Bahujan Mahasangh (BBM), Election Commission, Two day Jail, B. R. Ambedkar, Dalit, Yashwant, Prakash Yashwant Ambedkar, Sushilkumar Shinde, irresponsible Prime Minister, Pulwama suicide attack, Maharastra, politics

Bharipa Bahujan Mahasangh (BBM) chief Prakash Ambedkar threatened that if voted to power, his party would "throw the Election Commission (EC) into jail" for banning any reference to the Pulwama suicide attack during the elections.

సీఈపీని రెండు రోజులు జైలులో పెట్టిస్తా: ప్రకాష్ అంబేద్కర్

Posted: 04/04/2019 08:05 PM IST
Will jail ec for two days if voted to power prakash ambedkar

కేంద్ర ఎన్నికల సంఘం వైఖరిపై దేశంలోని పలుచోట్ల రాజకీయపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఓ పార్టీ నాయకుడు ఏకంగా వారిపై కన్నెర చేసే వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ కనక అధికారంలోకి వస్తే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను రెండు రోజుల పాటు జైలులో పెట్టిస్తానని అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యాలు చేసింది ఎవరో అయితే పెద్దగా సంచలనం సృష్టించి వుండేవికావేమో కానీ.. ఏకంగా రాజ్యాంగ నిర్మాత మనవడు ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ యశ్వంత్ అంబేడ్కర్ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే రెండ్రోజుల పాటు ఈసీని జైల్లో పెడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భరిప బహుజన్ మహాసంగ్ చైర్మన్ హోదాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, పుల్వామా దాడి ఘటన పట్ల ప్రచారంలో మాట్లాడనీయకుండా నోరు నొక్కేస్తున్నారంటూ ఈసీపై విమర్శలు చేశారు.

రాజ్యాంగం ప్రకారం నియమాలు అంగీకరిస్తున్నా, పుల్వామా పట్ల స్పందించకూడదని అభ్యంతరం చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో స్పందించి వ్యాఖ్యలు చేయకూడదన్న ఈసీ అదే తరుణంలో మన దేశం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ అంశాన్ని కూడా ప్రచారానికి వినియోగించుకోరాదని అధికార పార్టీతో ఎందుకు చెప్పలేదని ఆయన నిలదీశారు. ఈసీ అన్ని పార్టీల పట్ల ఒకే తీరుగా వ్యవహరించడంలేదని, బీజేపీకి కొమ్ముకాస్తున్న సూచనలు కనిపిస్తున్నాయని ప్రకాశ్ అంబేడ్కర్ ఆరోపించారు. ప్రకాశ్ అంబేడ్కర్ ఈ ఎన్నికల్లో షోలాపూర్, అకోలా లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles