RBI cuts repo rate by 25 bps ఎన్నికల తాయిలం: తగ్గిన రెపోరేటు.. రుణాలపై తగ్గిన వడ్డీ

Rbi lowers repo rate by 25 bps to 6 cuts gdp growth forecast

RBI, repo rate, reverse repo rate, 25 basis points, home loan, car loans, cheaper, lok sabha elections, RBI monetary policy,Repo rate,dalal street,sensex,rbi policy,market news,Nifty

RBI's monetary policy committee (MPC), led by Governor Shaktikanta Das, announced a 25 basis points cut in the short-term lending rate, also known as repo or repurchase rate, in its first bi-monthly rate review of financial year 2019-20. The repo rate now stands at 6 per cent.

ఎన్నికల తాయిలం: తగ్గిన రెపోరేటు.. రుణాలపై తగ్గిన వడ్డీ

Posted: 04/04/2019 01:54 PM IST
Rbi lowers repo rate by 25 bps to 6 cuts gdp growth forecast

కేంద్ర ప్రభుత్వం అదేశించిందో లేక స్వతహాగానే తీసుకుందో కానీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ రుణగ్రస్తులకు మంచి శుభవార్తను వెలువరించింది. కొత్త అర్థిక సంవత్సరం 2019-20ని పురస్కరించుకుని.. రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో జరిగిన తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షా సమావేశంలో బ్యాంకుల నుంచి రుణాలు పోందిన రుణగ్రస్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఇధి ఏప్రిల్ మాసం కాబట్టి మిమ్మల్ని ఫూల్ చేయడం లేదని, పూర్తిగా నిజం అంటోంది.

బ్యాంకుల నుంచి గృహాలు కట్టుకునేందుకు హోంలోన్ తీసుకున్నవారితో పాటు, కారు లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న వారికి స్వల్ప ఊరటను అందించింది. ఈ రుణాలపై వడ్డీని స్వల్పంగా తగ్గించింది. ఇక నుంచి బ్యాంకుల నుంచి తీసుకునే అప్పులతోపాటు.. గతంలో ఫ్లోట్ విధానంలో ఉన్న హోం, కార్ లోన్లపై కూడా వడ్డీ తగ్గనుంది. 2019, ఏప్రిల్ 4వ తేదీన సమావేశం అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు చైర్మన్ శక్తికాంత్ సింగ్.

రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది RBI. దీంతో ప్రస్తుతం ఉన్న 6.25శాతం రెపోరేటు.. 6శాతానికి దిగి వచ్చింది. ఈ మేరకు బ్యాంకుల నుంచి తీసుకునే అప్పులపై వడ్డీ తగ్గనుంది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు ఊరట ఇచ్చే అంశం. లక్షలు పోసి బ్యాంకు లోన్ తో ఇల్లు తీసుకున్న వారికి కొంతంలో కొంత ఊరట ఇచ్చే అంశం. కొత్త రెపోరేటు లెక్కన.. 30 లక్షల హోంలోన్  పై నెలకు 400 రూపాయల వరకు వడ్డీ తగ్గనున్నట్లు అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  repo rate  reverse repo rate  25 basis points  home loan  car loans  cheaper  lok sabha elections  

Other Articles