2 crore seized from Jayabheri group employees పట్టుబడిన ధనభేరి.. మురళీమోహన్ సహా ఐదుగురిపై కేసు..

Cash seizure tdp mp murali mohan others booked in hyderabad

TDP, Murali Mohan, maganti roopa, Jayabheri Group, Rs 2 Crore cash seize, V.C.Sajjanar, Cyberabad Police Commissioner, Jayabheri Group employees, hyderabad, cyberabad commissioner sajjanar, General Elections 2019, TDP, BJP, YSRCP, Chandrababu, YS Jagan, Congress, Assembly Elections, lok sabha elections, rajamundry lok sabha, vijayawada, Andhra Pradesh, Politics

The Cyberabad police booked a case against Rajamundry TDP MP Murali Mohan and five others in connection with the Rs 2 crore unaccounted cash which was seized at the Hitech City Railway Station

పట్టుబడిన ధనభేరి.. మురళీమోహన్ సహా ఐదుగురిపై కేసు..

Posted: 04/04/2019 01:10 PM IST
Cash seizure tdp mp murali mohan others booked in hyderabad

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ లో ఏర్పాటు చేసిన 21 చెక్ పోస్టులులో తమ పోలీసులు అనుమానాస్పద వాహనాలను, వ్యక్తులను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. పోలీసుల తనిఖీల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు తమకు అనుమానాస్పదంగా కనిపించారనీ, దీంతో వారి వాహనంలో సోదాలు నిర్వహించామని అన్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ నగదును తీసుకెళుతున్న వ్యక్తులను నిమ్మలూరి శ్రీహరి, పండరిగా గుర్తించామని తెలిపారు. వీరిద్దరూ జయభేరి కంపెనీలో ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారని తమ విచారణలో తేలిందని చెప్పారు. అయితే ఈ డబ్బుకు సంబంధిత పత్రాలను చూపడంలో వారు విఫలం కావడంతో.. డబ్బును ఎన్నికల నేపథ్యంలో ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం వచ్చి వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. తమ విచారణలో రూ.2 కోట్ల నగదును రైలు ద్వారా తరలించేందుకు వీరు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు.

జయభేరీ సంస్థకు చెందిన ధర్మారాజు, జగన్మోహన్ ఈ డబ్బును టీడీపీ నేత మురళీ మోహన్ కు అందించాల్సిందిగా చెప్పినట్లు నిందితులు శ్రీహరి, పండరి తమ విచారణలో తెలిపారని అన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ మురళీ మోహన్, యలమంచిలి మురళీకృష్ణ, జగన్మోహన్, ధర్మరాజు, పండరి, శ్రీహరిలపై కేసు నమోదుచేశామని సజ్జనార్ తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 171బీ, 171ఈ, 171సీ, 171 ఎఫ్ కింద కేసు నమోదు చేశామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles