Nagababu fires on Raghurama Krishnam Raju ప్రజలకు దూరంగా వుండే పందెంరాయుళ్లే నాన్ లోకల్: నాగబాబు

Nagababu fires on raghurama krishnam raju for non local critics

pawan kalyan, Nagababu, non local, raghurama krishnam raju, media Interview, narsapuram, lok sabha elections, assembly elections, janasena, YSRCP, BJP, andhra pradesh, politics

Mega brother, Janasena President Pawan Kalyan Kin and Narsapuram lok sabha contestant Nagababu says, peoples representatives who will be far from people are non locals. And also states that, all those who involved in betting during festivals and ocassions in state are non locals.

ప్రజలకు దూరంగా వుండే పందెంరాయుళ్లే నాన్ లోకల్.. నేను లోకల్: నాగబాబు

Posted: 04/03/2019 11:54 PM IST
Nagababu fires on raghurama krishnam raju for non local critics

నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న మెగా బ్రదర్ నాగబాబు తన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు కూడా ధీటుగా, ఘాటుగా సమాధానం చెబుతున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు తనను 'నాన్ లోకల్' అంటూ తేలిగ్గా తీసిపారేయడంపై నాగబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజాసేవ చేసేందుకు వచ్చిన తాను లోకల్ అని.. కేవలం ఎన్నికల సమయంలో ప్రజలకు కనిపించి.. అవి ముగియగానే ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చోని బెట్టింగ్ లు కాసే పందెంరాయుళ్లే నాన్ లోకల్ అని ఘాటుగా సమాధానమిచ్చారు.

ఎన్నికలు ముగిసిన తరువాత అడ్రస్ కూడా కనిపించకుండా పోయే కుహానా రాజకీయ నాయకుణ్ణి తాను కాదని అన్నారు. తాను లోకల్ అని తన విద్యాబ్యాసం జరిగింది నర్సాపురంలోనేనని ఆయన చెప్పారు. అయినా తనను నాన్ లోకల్? అని విమర్శించేవారికి తన గురించి ఏం తెలుసునని ప్రశ్నించారు. తాను పుట్టింది మొగల్తూరులో అయినా హైస్కూల్ నుంచి కాలేజ్ వరకు నరసాపురంలోనే చదివానని అన్నారు. తన సతీమణి కూడా పశ్చిమ గోదావరి జిల్లానేనని చెప్పకోచ్చారు.

పశ్చిమ గోదావరి జిల్లా అంతా తిరిగానని. తమ నాన్నది కూడా పెనుగొండేనని. ఇవన్నీ తెలుసుకోకుండా చౌకబారు విమర్శలు చేస్తున్నారని ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ‘‘ఎవడా సన్నాసి నన్ను నాన్ లోకల్ అన్నది? ఇంతకంటే పనికిమాలినతనం మరొకటి ఉంటుందా? నాపై పోటీచేస్తున్న రఘురామ కృష్ణంరాజు ఏమన్నా లోకల్ అభ్యర్థా?’’ అంటూ ప్రశ్నించారు. చోక్కాలు మార్చినంత తేలిగ్గా పార్టీ మారుతున్న ఈ నేతలు తనను విమర్శిస్తారా.? అంటూ ఫైర్ అయ్యారు.

పండుగలు, పబ్బాలు వస్తే బెట్టింగ్ బంగార్రాజులా వ్యవహారాలు చేసే సిగ్గులేనివాళ్లు.. పరిశ్రమల పేరుతో వందల కోట్ల రూపాయలు ముంచి బ్యాంకులను దివాళా తీసిన ఘనులకు తనను విమర్శించే నైతికత వుందా.? అంటూ ప్రశ్నించారు. అసలైన లోకల్ అభ్యర్థిని తానేనని, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడానికే వచ్చానని చెప్పారు. తనలా ఎవరు వచ్చినా.. ఎక్కడి నుంచి వచ్చినా వాళ్లు లోకల్ వ్యక్తులనే నాగబాబు వ్యాఖ్యానించారు. తనను నాన్ లోకల్ అనే  రాస్కెల్స్ కంటే తానే మేలు అని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  Nagababu  non local  raghurama krishnam raju  janasena  andhra pradesh  politics  

Other Articles