Mayawati urges people of AP to give Pawan Kalyan a chance పవన్ కల్యాణే ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి: మాయావతి

Mayawati urges people of ap to give pawan kalyan a chance

pawan kalyan, Mayawati, Bahujana JanaSena YuddhaBheri, Pawan Kalyan speech at YuddhaBheri, Mayawati speech at YuddhaBheri, Vijayawada YuddhaBheri, Nadendla Manohar, VV Laxminarayana, janasena, BSP, CPI, CPM, TDP, YSRCP, BJP, Congress, andhra pradesh, politics

Bahujan Samaj Party president and former Uttar Pradesh Chief Minister Mayawati has appealed to the people of Andhra Pradesh to give Pawan Kalyan, “a young, dynamic, dedicated leader”, a chance to to serve them.

పవన్ కల్యాణే ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి: మాయావతి

Posted: 04/03/2019 10:32 PM IST
Mayawati urges people of ap to give pawan kalyan a chance

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. అంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును ఎంతగా కోరుకుంటున్నారో చూసిన తరువాత.. అందుకు కారణమైన జనసేన పార్టీ అధినేత ముఖ్యమంత్రి అవుతారని అమె ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలలో జనసేన-బీఎస్పీ-వామపక్షాల కూటమి తప్పక అధికారంలోకి వస్తుందని అమె అశాభావం వ్యక్తం చేశారు.

విజయవాడలోని సింగ్‌ నగర్‌లో ‘బహుజన జనసేన యుద్ధ భేరి’ పేరిట నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో అమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవికి పవన్ కల్యాణ్ అన్ని విధాలా అర్హుడని అన్నారు. అధికారంలోకి వచ్చే తమ కూటమి ప్రభుత్వం గతంలో ఏపీని ఏలిన రాజకీయ పార్టీల మాదిరిగా కాకుండా.. ఉత్తర్ ప్రదేశ్ లోని బీఎస్పీ పాలన సాగించిన విధానాలనే కొనసాగిస్తూ పాలన సాగుతుందని అమె విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ, వామపక్షాల కూటమిని గెలుస్తుందన్న నమ్మకం తనకుందన్న అమె అరుపులు, ఈలలు, కేకలతో అది సాధ్యం కాదని, ఎన్నికలకు తక్కువ సమయమే వున్నందున్న కార్యకర్తలు తమ శక్తిమేర ప్రచారం చేసి కూటమిని విజయం దిశగా నడిపించాలని కోరారు. ఏపీ ప్రజలు చంద్రబాబు, జగన్ వలలో పడొద్దని, కొత్త నాయకత్వాన్ని ఆదరించాలని మాయావతి కోరారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, అన్ని వర్గాల ప్రజలను మోదీ మోసం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి సరైన న్యాయం జరగలేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  Mayawati  Bahujana JanaSena YuddhaBheri  Vijayawada  janasena  BSP  andhra pradesh  politics  

Other Articles