"will boycott lok sabha polls" Nizamabad village farmers ఎన్నికలను బహిష్కరిస్తామన్న నిజామాబాద్ రైతులు

Will boycott lok sabha polls nizamabad village farmers

farmers to boycott eletions, farmers to boycott lok sabha polls, nizamabad farmers to boycott elections, farmers, rythubandhu cheques, TRS, keshpally village, jakranpally mandal, nizamabad, Telangana, politics

Farmers of keshpally village says if their rythubandu cheques are not given within the expected time, they will boycott lok sabha elections.

మా చెక్కులు మాకివ్వకపోతే ఎన్నికల బహిష్కరిస్తాం: నిజామాబాద్ రైతులు

Posted: 04/03/2019 04:11 PM IST
Will boycott lok sabha polls nizamabad village farmers

నాలుగు నెలల ముందువచ్చిన తెలంగాణ ఎన్నికలలో రైతు బంధు పథకం పేరు చె్ప్పకుని మరోమారు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి లోక్ సభ ఎన్నికల విషయానికి వచ్చే సరికి రైతులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట కవిత నిజమాబాద్ లో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అక్కడి రైతులు అమెకు వ్యతిరేకంగా ఏకంగా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఎర్రజోన్న పంటలకు మద్దతు ధర ప్రకటించకపోవడం, పసుపు మార్కెటంగ్ కు అనువుగా బోర్టును ఏర్పాటు చేస్తామని అంతకుముందు ఇచ్చిన హామీలను నెరవేర్చని కారణంగా అమెపై అగ్రహంతో వున్న రైతులు ఏకంగా రాస్తారోకోలు కూడా చేశారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో వారు కవితకు పోటీగా ఎన్నికల బరిలో నిలిచారు. ఇలా ఎర్రజోన్న రైతులు, పసుపు రైతులు ఓ వైపు అమెపై యుద్దం ప్రకటిస్తున్న క్రమం కోనసాగుతుంది.

అ తరుణంలోనే తమకు అందాల్సిన రైతు బంధు చెక్కులు అందకపోవడంతో తెలంగాణలోని ఓ గ్రామానికి చెందిన రైతులు మరో అడుగుముందేకేసి తమ కోపాన్ని వినూత్నంగా ప్రధర్శించేందుకు రెడీ అయ్యారు. తమకు చెక్కులను అందించకుంటే లోక్ సభ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. నిర్ణీత గడువులోగా ఈ విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే ఈ ఎన్నికల్లో ఓటేయబోమని స్పష్టం చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో చోటుచేసుకుంది.

జిల్లాలోని కేశుపల్లి గ్రామ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు చెక్కులు అందలేదు. అధికారులను ఈ విషయమై పలుమార్లు కలిసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో చివరికి విసిగిపోయిన గ్రామస్తులు లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాలని ఉమ్మడిగా నిర్ణయించారు. ఈ నెల 10లోగా రైతు బంధు చెక్కులు తమకు అందేలా చర్యలు తీసుకోవాలనీ, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఈ విషయమై ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఇంతవరకూ స్పందించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : farmers  rythubandhu cheques  TRS  keshpally village  jakranpally mandal  nizamabad  Telangana  politics  

Other Articles