1700 Jan Dhan accounts credited with Rs 10000 ఎన్నికల వేళ జన్ ధన్ అకౌంట్లలో డిపాజిట్ల కలకలం..

1700 jan dhan bank accounts under election commission scanner

Bank of Baroda, Moradabad, Suspicious transactions, Jan Dhan acount holders, Probe, Moradabad district administration, Rajan Anandan, Jan Dhan Bank, congress, Uttar pradesh, politics

About 1700 Jan Dhan accounts in a Bank of Baroda branch in Moradabad were credited with Rs. 10,700 each, leading to a flutter of excitement in the industrial town in Uttar Pradesh

ఎన్నికల వేళ జన్ ధన్ అకౌంట్లలో డిపాజిట్ల కలకలం..

Posted: 04/03/2019 05:23 PM IST
1700 jan dhan bank accounts under election commission scanner

కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం అధిష్టించిన తరువాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేదలకు జన్ ధన్ యోజన పథకాన్ని అందించారు. ఈ పథకం కింద దేశంలోని అనేకమంది అభాగ్యులకు ఎలాంటి ఢిపాజిట్, బ్యాలెన్స్ లేని బ్యాంకు అకౌంట్లను తెరిపించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ముందు వాటిల్లో పదిహేను లక్షల రూపాయల వేస్తానని నరేంద్రమోడీ హామి ఇవ్వడం ఆ తరువాత వెంటనే బ్యాంకు అకౌంట్లు తెరిపించడంతో.. నిజంగానే డబ్బులు వేస్తారని పేదలు పోటీపడి మరీ అకౌంట్లు తెరిచారు.

దీంతో బ్యాంకు అధికారులు కూడా విస్తు చెంది జన్ ధన్ యోజన ఖాతాలకు సంబంధించిన అకౌంట్ ధరఖాస్తులు తమ వద్ద లేవని చెప్పి ఉప్పెనలా వస్తున్న అకౌంట్లను తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేశారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ఈ అకౌంట్లు పెరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా అకౌంట్లు వున్నాయని చెప్పుకోడానికే తప్ప.. వాటిల్లో డబ్బులు మాత్రం పడట్లేదని పేదులు ఆశగా ఎదురు చూసిన పేదలు ఇక తమ కష్టాన్నే నమ్మకున్నారు.

2016 డిసెంబర్ లో పెద్ద నోట్ల రద్దు జరిగిన తరువాత ప్రధాని దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తరువాత ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలోనూ ఆయన ప్రచారం చేసిన వ్యాఖ్యలతో మళ్లీ పేదల్లో అశలు రేగాయి. మీ అకౌంట్లలో నల్లధన కుబేరులు డబ్బులు వేస్తారు. వాటిని తీసుకోండి కానీ తిరిగి ఇవ్వకండి.. ఎవరైనా బెదిరిస్తే తనకు ఓ చిటీ రాయాలని కూడా చెప్పారు. దీంతో తమ అకౌంట్లలో డబ్బులు వేయమని ఎవరైనా వచ్చి అడుగుతారా.? అని పేదలు పనులు మానుకుని బ్యాంకుల వద్దే పడిగాపులు కాశారు. అయినా ఆ ఆశలు కూడా అడియాశలయ్యాయి.

ఇలా ఐదేళ్లు పూర్తికావస్తున్నా తమ జన్ ధన్ అకౌంట్లలో పదిహేను లక్షలు కాదుకదా.. కనీసం 15 వేల రూపాయలు కూడా జమకాలేదు. దీంతో ఊసురుమంటున్నారు దేశంలోని పేదలు. ఇప్పుడీ జన్ ధన్ అకౌంట్ల గోల ఎందుకు అంటారా.? ఉత్తర్ ప్రదేశ్ లోని ఏకంగా 1700 జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాల్లో అనుమానాస్పద డిపాజిట్లు వచ్చి చేరాయి. అందుకు సంబంధించిన మెసేజ్ ఫోన్లకు చేరడంతో ఖాతాదారులంతా బ్యాంకులకు చేరుకుని తమ అకౌంట్లలోని డబ్బును విత్ డ్రా చేసుకున్నారు. ఈ వార్త దవాణంలో వ్యాపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

మొరాదాబాద్‌ జిల్లాలో 1700 జన్‌ధన్‌ ఖాతాల్లో గత కొద్ది రోజుల్లోనే పెద్ద మొత్తంలో డబ్బు జమ అయ్యింది. ఒక్కో ఖాతాలో 10 వేల రూపాయల చొప్పున మొత్తం కోటీ 70 లక్షల రూపాయలు డిపాజిట్‌ అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఎన్నికల అధికారులు నిఘా పెట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను ప్రలోభాలకు గురుచేయడానికి రాజకీయ నాయకులు ఎవరైనా జన్‌ధన్‌ ఖతాల్లో డబ్బు జమ చేశారా? లేక  ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందిన వారికి బ్యాంకు ఖాతాల్లో ఇప్పుడు నగదు జమైందా అనే అంశాలను ఈసీ పరిశీలిస్తోంది. అనుమానాస్పద డిపాజిట్లపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bank of Baroda  Moradabad  Suspicious transactions  Jan Dhan acounts  Uttar pradesh  politics  

Other Articles