change is possible only with Pawan Kalyan: Mayawati మార్పు కోసం వచ్చిన పవన్ కల్యాణే సీఎం: మాయావతి ధీమా

Peoples desperation for change is possible with pawan kalyan mayawati

pawan kalyan, Mayawati, Nadendla Manohar, VV Laxminarayana, janasena, BSP, CPI, CPM, TDP, YSRCP, BJP, Congress, andhra pradesh, politics

Andhra pradesh Peoples desperation for change in politics, change in lively hood, change in development is possible only with Pawan Kalyan's Janasena party says BSP chief Mayawati. His party will ensure growth of every individual and development of every sector.

మార్పు కోసం వచ్చిన పవన్ కల్యాణే సీఎం: మాయావతి ధీమా

Posted: 04/03/2019 01:47 PM IST
Peoples desperation for change is possible with pawan kalyan mayawati

కేంద్రంపై ఆధారపడే ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర అభివృధ్దిని.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు విఘాతం కలిగించేంచే ప్రమాదం వుందని.. బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. కేంద్రంతో యుద్దమైనా చేసి.. మార్పును సాధిస్తానని.. రాష్ట్ర సమగ్రాభివృద్దికి, యువత బంగారు భవిష్యత్తుకు తాను కట్టుబడి వున్న జనసేన అధినేత పవన్ క్యలాణ్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా వుందని అమె అన్నారు. మార్పు కోరుతున్న కొత్త పార్టీతోనే రాష్ట్ర నిర్మాణం సాధ్యమవుతుందని ఇక్కడి ప్రజలు, మరీ ముఖ్యంగా యువత, మహిళలు ఈ మార్పును బలంగా కోరుకుంటున్నారని మాయావతి అభిప్రాయపడ్డారు.

మార్పుకు శ్రీకారం చుట్టిన జనసేన కూటమే అధికారంలోకి వస్తుందని అమె ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో జనసేన కూటమి తమ సత్తా చాటుకుంటుందని అన్నారు. పవన్ కల్యాణ్ అధినేత అలోచనా విధానం, ఆయన భావజాలంతో తమకు పార్టీకి పోలి వున్న నేపథ్యంలో తమ బీఎస్పీ పార్టీ కూడా పోత్తు కుదర్చుకుందని, దీంతో పాటు కమ్యూనిస్టు పార్టీలు కూడా కలవడం మార్పుకు నాంది పలికినట్లేనని అమె అన్నారు. తమ అలెయన్స్ పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కల్యాణ్ అని అమె మరోమారు పునరుద్ఘాటించారు. పవన్ సోషల్ నేచర్ వున్న వ్యక్తి, గ్రౌండ్ రియాలిటీ నుంచి సమస్యలను అధ్యయనం చేసి పరిష్కరించాలని భావించే వ్యక్తని అన్నారు. ఇలాంటి వ్యక్తి సీఎం కావడంతో మార్పు తప్పక సాధ్యపడుతుందని మాయవతి అన్నారు.

ప్రాంతీయ పార్టీలకు, జాతీయ పార్టీలకు రాష్ట్ర ప్రజలు ఇనేళ్లుగా అవకాశం ఇచ్చారని.. అధికారంలోకి వచ్చే వరకు ఓ పాట పడినా.. అధికారంలోకి వచ్చిన తరువాత పాత ఒరవడితోనే పాలన సాగించారని అమె విమర్శించారు. విశాఖలో పవన్‌కల్యాణ్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఆమె పవన్‌ కల్యాణే సీఎం అభ్యర్థి అని ప్రకటించారు. రాష్ట్ర ప్రజల జీవనస్థితిగతుల్లో మార్పును తీసుకువస్తానని, యువత కోరుతున్న ఉద్యోగాలలో మార్పు సాధ్యమని విశ్వసించే పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని అమె కోరారు. ఉత్తర్ ప్రదేశ్ తరహలో ప్రతీ వ్యక్తి విసాకానికి ప్రతీ వర్గం అభివృద్దికి ప్రభుత్వం పనిచేస్తుందని అమె అభిలాషించారు.

కేంద్రంలో అధికారంలో వున్న పార్టీలు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీతో ఓట్లు వేయించుకున్నాయి కానీ, హామీలను నిలబెట్టుకోలేదు. దీంతో ఆంధ్రులకు కేంద్రంలోని ప్రభుత్వాలపై కోపం ఉంది. అదే విధంగా ఇటు టీడీపీ, అటు వైసీపీ పార్టీల ప్రలోభాలలో ఓటర్లు చిక్కుకోకూడదని అమె పిలుపునిచ్చారు. ఈ రెండు పార్టీలు కేంద్రపైనే అధారపడతాయని అమె చురకలంటించారు. కేంద్రంతో యుద్దం చేసైనా హక్కులను సాధిస్తామన్న పవన్ కల్యాణ్ లాంటి యువనేత ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగుతందని అన్నారు.

గత ఎన్నికలకు ముందు ఓటర్లకు ఎన్నో హామీలు కురిపించిన కాషాయ పార్టీ.. అధికారంలోకి వచ్చి 60 ఏళ్లు కావస్తున్నా హామీలను నెరవేర్చలేదని అన్నారు. అయితే హామీలపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపి కొత్త ఎత్తుగడలు వేసిందని.. అందులో భాగంగా తెరపైకి సర్జికల్ స్ట్రైక్స్ అంశాన్ని తీసుకువచ్చిందని మాయావతి అరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు కానీ, ప్రత్యేక రాష్ట్రంగా మారిన తరువాత కానీ అభివృద్ది జరగలేదని.. అభివృద్దే జరిగితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చివుండేదే కాదని మాయావతి అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  Mayawati  Nadendla Manohar  janasena  BSP  CPI  CPM  andhra pradesh  politics  

Other Articles