Mayawati should become PM says Pawan Kalyan మాయావతి ప్రధానైతేనే అట్టగుడువర్గాల అభివృద్ది: పవన్

Mayawati should become pm for uniform growth in country pawan kalyan

pawan kalyan, Mayawati, Nadendla Manohar, VV Laxminarayana, janasena, BSP, CPI, CPM, TDP, YSRCP, BJP, Congress, andhra pradesh, politics

Janasena party President Pawan Kalyan says India as a nation will see Uniform growth in all sectors including dalits and bcs only if BSP chief Mayawati becomes Prime Minister of India.

మాయావతి ప్రధానైతేనే అట్టగుడువర్గాల అభివృద్ది: పవన్ కల్యాణ్

Posted: 04/03/2019 12:16 PM IST
Mayawati should become pm for uniform growth in country pawan kalyan

బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రధాని కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అకాంక్షించారు. అమె ప్రధాని అయితే అట్టడువర్గాల అభ్యున్నతి సాధ్యమని, వారితో పాటు అన్ని వర్గాల ప్రజలకు సమతూల్య అభివృద్ది జరగాలంటే మాయావతి ప్రధాని కావాల్సిందేనని అభిలాషించారు. అమె నేతృత్వంలోని బీఎస్సీ పార్టీతో కలిసి పనిచేస్తుండడం ఆనందంగా ఉందన్నారు. దళితులను సీఎం చేస్తానన్న హామీతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉదృతమై, అవిర్భమైందని ఆయన అన్నారు. అయితే ఎన్నికలకు ముందుఇచ్చిన హామీని అధికారంలోకి రాగానే కేసీఆర్‌ విస్మరించారని పవన్ కల్యాణ్ అరోపించారు.

దళితుడిని సీఎం చేయకపోయినా ప్రధానిని చేసే అవకాశం ఉంది. మాయావతిని ప్రధానిగా చూడాలన్నదే తన కల అని చెప్పిన ఆయన అమె ఒంటరి మహిళగా, దేశంలోనూ తృతీయ జాతీయ పార్టీని నడుపుతున్న ధీరవనితగా పవన్ కల్యాణ్ కొనియాడారు. దశాబ్ద కాలంగా బీఎస్పీతో కలసి పనిచేయాలని చర్చలు జరుగుతున్నాయన్నారు. దళిత ఉద్యమాలలో పనిచేసిన అనేక మంది మేధావులు, కీలక భూమిక పోషించిన కార్యకర్తలు, నాయకులు తనతో ఈ మేరకు చర్చలు కూడా జరిపారని అన్నారు.

అయితే 2014లో అప్పటి పరిస్థితులను బట్టి బీజేపి, టీడీపీతో కలిసి ముందుకెళ్లామని అయితే వారిచ్చిన హామీలను విస్మరించడంతో ఇప్పుడు వారికి దూరంగా వున్నామని చెప్పారు. బీజేపి, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ అవగాహనకు విరుద్దంగా పనిచేస్తున్న తరుణంలో బీఎస్పీ మాత్రం స్థానిక సమస్యల పరిష్ాకరం దిశగా ముందుకు సాగుతుందని అన్నారు. ఒక ఛాయ్ వాలా ప్రధాని కాగలగడం.. తరువాత చౌకీదార్ గా ప్రధాని పదవిని అట్టిపెట్టుకోవాలని చూస్తున్న క్రమంలో దళిత ధీర వనిత మాయావతి కూడా ప్రధాని కాగలరని పవన్ అకాంక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  Mayawati  Nadendla Manohar  janasena  BSP  CPI  CPM  andhra pradesh  politics  

Other Articles