Is Raghurama krishnam raju a defaulter? రఘురాముడు.. అర్థిక నేరస్థుడేనా.? రూ.1000 కోట్లు స్వాహానా.?

Is raghurama krishnam raju a fraudster defaulter for rs 1000 crores

Power Finance Corporation, Axis Bank, Delhi Police, Hyderabad, Madras, Power Grid Corporation of India, Rural Electrification Corporation, Loan Fraud, India Infrastructure Finance Co, Ind-Barath Power, Ind-Barath Power Infra, PSU Companies, K Raghu Rama Raju, Madhusudan Reddy, Ind-Barath Power Madras, IIFCL, Trust and Retention Account, Comptroller and Auditor General, CAG, raghurama krishnam raju, ysrcp, kcr, trs, chandrababu, loksabha elections 2019, narsapuram, hyderabad, Andhra Pradesh, Telangana, AP politics, latest news

PFC, REC have accused Ind-Barath Power (Madras) Ltd, Ind-Barath Power Infra Ltd, Group chairman K Raghu Rama Raju, and director Madhusudan Reddy, diverted the funds and siphoning off Rs 1,000 crore of public money.

రఘురాముని.. అర్థిక నేరచరితను వినుమా..

Posted: 04/01/2019 06:03 PM IST
Is raghurama krishnam raju a fraudster defaulter for rs 1000 crores

వైసీపీ పార్టీ నుంచి బరిలో నిలిచిన రఘురామకృష్ణం రాజు అర్థిక నేరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల బరిలో గెలిచే పార్టీల టికెట్ సాధించి.. అ అధికారమే తన బలంగా మార్చుకుని చట్టాలకు చిక్కకుండా, తప్పించుకుని తిరిగేస్తున్న ఆయన తీరు అటు ఆయన పోటీ చేస్తున్న నర్సాపురం నియోజకవర్గంలోనే కాదు ఇటు రాష్ట్రవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. బ్యాంకుల్లో సామాన్యులు దాచుకున్న వేల కోట్ల రూపాయలను రుణాలుగా పొంది ఆ తరువాత ఉద్దేశపూర్వకంగా కుచ్చుటోపి పెట్టిన ఘనులు మనదేశంలో ఎందరోవున్నారు.

వారిలో కొందరు ఏకంగా ప్రజాభీష్టం కోరుతూ బరిలోకి కూడా దిగుతున్నారు. ఇప్పటికే వారిపై కేసులు నమోదైనా.. వారు తమ వద్దనున్న అంగబలంతో, అర్థబలంతో ప్రజల సోమ్మును వారికే పంచుతూ ప్రజాప్రతినిధులు చలామణి అయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తిండికి అంగలార్చే మనుషులు కడుపు నింపుకోవడం కోసం దోంగతనం చేస్తే దొంగ అని ముద్ర వేసే సమాజం.. ఇలాంటి అవినీతి బకాసురులను, అర్థిక ఉగ్రవాదులను మాత్రం పెద్ద మనుషులుగానే పరిగణిస్తోంది.

అసులు వీరికి రాజకీయాల్లో నిలబడే హక్కు వుందా.? వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకున్న అవినీతి పరులను చట్టసభలకు పంపితే.. వారు ఎవరికి మేలు చేస్తారు.? ప్రజల కోసం పనిచేస్తారా.? ప్రజల సమస్యల కోసం గళమెత్తుతారా.? ప్రజాహిత పాలనను అందించగలరా.? అని అలోచించాల్సిన తరుణం అసన్నమైంది. ఓట్లను కూడా ప్రజల డబ్బులతో కోనేసి అందలం ఎక్కాలని భావించే అర్థిక నేరస్థుల విషయంలో అప్రమత్తంగా వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది.

తాము అధికారంలోకి వస్తే మద్యనిషేదం ఎంత బాగా అములు చేస్తామో.. అదే మత్తులో ఊగుతూ చెప్పారని ఇదే రఘురామకృష్ణం రాజుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అది చాలదన్నట్లు గత నెల 3న వైసీపీలో చేరిన ఈ నేత తనకు తెలుగు రాష్ట్రాలలో అసలు వ్యాపారాలే లేవని చెప్పడం.. అంతటితో ఆగని ఆయన తనను బెదిరించే ధైర్యం తెలుగు రాష్ట్రాలలో ఎవరికీ లేవని కూడా తేల్చిచెప్పారు. ఎవరో బెదిరిస్తే తాను పార్టీ మారలేదని చెప్పిన ఈ అర్థిక నేరస్థుడు.. తాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుడ్ని కూడా కాదని ఓ ఛానెల్ ఇంటర్య్వూలో కూడా చెప్పడం కొసమెరుపు.

ఇక రఘురామకృష్ణం రాజు అవినీతి పుట తెరిస్తే..

ఇండ్-భారత్ పవర్ ఇన్ ఫ్రా కంపెనీ విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థ. ఈ సంస్థకు చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రఘురామకృష్ణంరాజు. ఈ సంస్థ ఏకంగా రూ. 1000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని అరోపణలు వున్నాయి. ఈ సంస్థ అవినీతి భాగోతాన్ని గతంలో సాక్షి దినపత్రిక కూడా తాటికాయంత అక్షరాలతో ప్రచురించింది. సాక్షి మాత్రమే కాదు ఇండ్ భారత్ సంస్థ వెయ్యి కోట్ల రూపాయలను స్వాహా చేసిందని జాతీయ పత్రికలు కూడా ప్రముఖంగా ప్రచురించాయి.

ఈ మేరకు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్ (ఆర్ఈసీ) సంస్థలు అరోపించిన కథనాలు ఇప్పటికీ మనకు నెట్టింట్లో లభ్యమవుతాయి. ఈయనకు చెందిన మరో సంస్థ ఇండ్ భారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్. ఈ రెండు సంస్థలు హైదరాబాద్ కేంద్రంగానే తమ కార్యకలాపాలు, లావాదేవీలు సాగిస్తున్నాయి. అయిన సదరు నేత మాత్రం తెలుగు రాష్ట్రాలలోనే తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని తాను ఎవరి బెదిరింపులతో వైసీపీలో చేరలేదని చెప్పడం  గమనార్హం.

తమిళనాడులోని తుత్తుకుడి జిల్లాలో 660 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పాదన కోసం ఇచ్చిన రుణాలను కె.రఘురామ కృష్ణంరాజోతో పాటు ఆ సంస్థ డెరెక్టర్ మధుసూదన్ రెడ్డి కలసి నిధులను దారిమళ్లించారని, పీఎఫ్సీ, ఆర్ఈసీలు అరోపించాయి. ఈ ఇద్దరు కలసి తమ రెండు సంస్థల పేర్లతో పోందిన ఏకంగా రూ.947 కోట్ల రూపాయలను స్వాహా చేశాయని పీఎఫ్సీ, ఆర్ఈసీలతో కలసి ఐఐఎఫ్సిఎల్ కంపెనీలు ఆర్థిక నేరస్థుల విభాగానికి పిర్యాదు చేశాయి. దీంతో గత ఏడాది అక్టోబర్ 3న ఈ కంపెనీలుతో పాటు డైరెక్టర్లపై 420, 406, 120బి సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయబడ్డాయి.

ఇలాంటి ఓ ఆర్థిక నేరస్థుడు ఇప్పుడు నర్సాపురం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంటు బరిలో నిలచాడు. ప్రజల సోమ్ములోని కొంత మొత్తాన్ని ఎన్నికలలో వెచ్చించి.. ఓటర్లు డబ్బు పంచి మరీ ఓట్లను కొనుగోలు చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడని, ఓ తెలుగు మీడియాలో వార్త సంచలనంగా మారింది. ప్రజల సోమ్మునే ప్రజలకు పంచి అందలాన్ని ఎక్కి తన అవీనీతిని మరో ఐదేళ్ల పాటు తెరపైకి రాకుండా ప్రయత్నాలు చేస్తున్నాడని ఓ తెలుగు ఛానెల్ వార్తను ప్రసారం చేసింది.

అంతేకాదు.. ఇలా అధికారంలోకి వచ్చిన తరువాత ఇంకెన్ని అక్రమాలకు పాల్పడుతారోనని కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. మరీ ఇలాంటి వ్యక్తులు ఓటు వేస్త వారు తమ వ్యాపారవ్యవహారాలను చక్కబెట్టుకుంటారా..? లేక ప్రజల సమస్యలపై చట్టసభల్లో గళమెత్తుతారా.? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇక తమ అవినీతి భాగోతం ప్రజలకు తెలియడంతో.. వారు తమ గెలుపు కోసం ప్రత్యర్థులను దెబ్బతీయడానికి కూడా కుట్రలు పన్నుతున్నారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. పొరుగు జిల్లాల నుంచి కోందరిని తీసుకుని వచ్చి తాము ప్రభాస్ అభిమానులమని. కొందరు తారక్, మరికోందరు మహేష్ బాబు అభిమానులమని చెప్పి తాము జనసేనకు మద్దతు ఇవ్వడం లేదని కూడా చెప్పించడంపై ఆయా తారాల అభిమానులు కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles