pawan kalyan fires on YS Jagan at tanuku ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టనన్న పవన్ కల్యాణ్

Janasena chief pawan kalyan fires on ys jagan at tanuku

pawan kalyan, janasena, Pawan Kalyan tanuku meeting, Pawan Kalyan fires on YS Jagan, pawan kalyan andhrula atmagauravam, pawan kalyan andhrites self respect, pawan kalyan fires on YS Jagan, pawan kalyan fires on YS Jagan at tanuku, andhra pradesh, politics

Actor turned politician JanaSena party Chief pawan kalyan fires on YS Jagan at tanuku, says he will never bow before anyone and not let people of Andhra to bow in front of any one at any cost.

జగన్ పై జనసేనాని ఫైర్.. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టనన్న పవన్

Posted: 04/01/2019 07:38 PM IST
Janasena chief pawan kalyan fires on ys jagan at tanuku

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తాను టీడీపీతో కలిశానని వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఈ ప్రచారం టీడీపీ నేతలు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. వైసీపీ నేతలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇరు పార్టీలు కలిసి ఐదేళ్ల వయసున్న జనసేన అనే బిడ్డను కొడుతున్నారని పవన్ ఆరోపించారు. టీడీపీ, వైఎస్ఆర్సీపీలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ఆ ఇద్దరు కంసులకు జనసేనాని కృష్ణుడంటే భయం ఉంది. మన కురుక్షేత్రంలో ఇద్దరు కంసులను తలపడాలని జనసేనాని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

జనసేన వైఎస్ఆర్సీపీతో కలిసి వెళ్లలేదనేదే జగన్ బాధ అని పవన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీతో కలిసి వెళ్తే బాగుంటుందని గతంలో తెలంగాణ నాయకులు తనతో చెప్పారని పవన్ తెలిపారు. వైసీపీతో తాను కలవకపోవడానికి జగన్ కుళ్లే కారణమన్నారు పవన్. సీఎం అంటే జగనే కావాలా? పవన్ కళ్యాణ్ సీఎం కావొద్దా? వైఎస్ కుటుంబీకులే సీఎం కావాలా? నారా వారి కుటుంబీకులే రాజకీయం చేయాలా? అని జనసేనాని ప్రశ్నించారు.

2009లోనూ ఇలాగే పనికిమాలిన దుష్ప్రచారం చేశారని పవన్ విమర్శించారు. జగన్ ఏడాదికొకరి చొప్పున నియోజకవర్గ ఇన్‌ఛార్జిలను మార్చి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ‘నేను మగాణ్ని.. ఏదైనా మాట్లాడితే దమ్ముగా బయటకొచ్చి మాట్లాడతాను. ఉద్యమాన్ని నడిపిన నాయకుడిగా కేసీఆర్ అంటే గౌరవం. కానీ జగన్‌లా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ దగ్గర తాకట్టు పెట్టలేను. బిస్కెట్లు పడేస్తే జగన్‌లా పడి ఉండాల్సిన ఖర్మ లేదు.

టీడీపీతో జతకట్టాల్సిన అవసరం లేద’న్న పవన్.. 2018లో టీఆర్ఎస్ తెలంగాణలో తెంచిన సైకిల్ చైన్ ను 2019లో తాము ఏపీలో కూడా తెంపేసామని పవన్ కల్యాణ్ అన్నారు. తాను వస్తే అధికారుల్లో అవినీతి ఉండదని జగన్ చెబుతున్నారు. రెండేళ్లు జైళ్లో ఉన్న జగన్ ఈ మాట చెబుతున్నారు. ఆయన వల్లే ఐఏఎస్ అధికారులు, మంత్రులు జైళ్లో ఉన్నారని పవన్ విమర్శించారు. అంటే ఆయన మాత్రమే అవినీతి చేస్తారా? ఇలాంటి వ్యక్తులు అవినీతి రహిత పాలన ఇస్తామంటే మేం నమ్మాలా? అని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  YS Jagan  Tanuku  Chandrababu  cycle chain  TDP  YCP  andhra pradesh  politics  

Other Articles