ys jagan rajasyamala yagam to attain power నెల్లూరులో జగన్ రాజశ్యామాల యాగం.. ఆంగ్లపత్రికలో కథనం..

Ys jagan secretly perfomes rajasyamala yagam at nellore to attain power

YSRCP president YS Jagan, YS Jagan rajasyamala yagam in nellore, YS Jagan rajashamala yagam, YS Jagan rajashyamala yagam KCR, KCR advise YS Jagan rajasyamala yagam, YCP rajashyamala yagam nellore, ys jagan rajasyamala yagam bangalore mirror, andhra pradesh, politics

Now this is a big news doing rounds in media after it published in Bangalore mirror. The news is that YSRCP president YS Jagan had secretly perfomed rajasyamala yagam at nellore to attain power.

నెల్లూరులో జగన్ రాజశ్యామాల యాగం.. ఆంగ్లపత్రికలో కథనం..

Posted: 03/30/2019 02:36 PM IST
Ys jagan secretly perfomes rajasyamala yagam at nellore to attain power

రాజకీయా పార్టీలు అన్నాక అధికారాన్ని అందుపుచ్చుకోవాలన్నదే పరమావధి. అలా అయితేనే రాష్ట్రంలోని ప్రజలందరికీ తమ పథకాలు అందజేసి వారి మనన్నలను అందుకోవచ్చని పార్టీలు భావిస్తుంటాయి. అయితే రాష్ట్ర విజభజతో తీవ్ర అర్థికలోటులోకి నెట్టివేయబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి అర్థిక పరిస్థితులను విశ్లేషించుకోకుండా అనేక పార్టీలు అందినకాడికి హామీలను గుప్పించాయి. కేంద్రంతో దోస్తి చేసినా అశించిన మేర లాభం లేకపోవడంతో.. హామీలను అచరణలో పెట్టేందుకు మాత్రం మీనమేషాలు లెక్కించాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

ప్రభుత్వ వైఫైల్యాలనే ప్రధాన ప్రచారస్త్రాలుగా మార్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రవ్యాపత్తంగా తిరుగుతూ వాటిపైనే ఎక్కుపెట్టారు. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం చేపట్టాలని భావిస్తున్న ఆయన.. తన మిత్రులు, సన్నిహితులు ఇచ్చిన ఏ కార్యక్రామానైనా వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. ఎంతో బిజీ షెడ్యూలు మధ్య కూడా ఆయన మిత్రుల సూచనలు పాటిస్తున్నారు. తాజాగా అలా అచరించిన ఓ సూచనే ఓ అంగ్ల పత్రికలో ప్రచురితం కావడం.. అదే ఇప్పుడు నెట్టింట్లో కూడా వైరల్ కావడం హాట్ టాపిక్ గా మారింది.

మరో 20 రోజుల్లో అధికారంలోకి వస్తానని పదేపదే చెప్పుకుంటున్న జగన్.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం కేసీఆర్ దారిలో నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు రాజశ్యామల యాగం చేయించినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో అత్యంత గోప్యంగా ఈ యాగం జరిగినట్టు ‘బెంగళూరు మిర్రర్’ ఆన్‌లైన్ ఎడిషన్ పేర్కొంది. జగన్ కుటుంబ సభ్యులు నిర్వహించిన ఈ యాగంలో ఆ కుటుంబానికి సన్నిహితుడైన ఒక్క ఎంపీ మాత్రమే పాల్గొన్నట్టు తెలిపింది.
 
రాజశ్యామల యాగంలో మొత్తం 27 మంది రిత్వికులు పాల్గొన్నట్టు బెంగళూరు మిర్రర్ పేర్కొంది. విశాఖ శారాదాపీఠం పీఠాధిపతి స్వామి స్వరూపానంద పర్యవేక్షణలో యాగం పూర్ణాహుతిని నిర్వహించినట్టు తెలిపింది. అలాగే, జగన్‌కు బదులు ప్రధాన రిత్వికులు వరుణ తీసుకుని యాగాన్ని పూర్తి చేసినట్టు వివరించింది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ కూడా రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఇప్పుడు కేసీఆర్ సలహాతోనే జగన్ కూడా యాగం నిర్వహించారని తెలుస్తోందని ‘బెంగళూరు మిర్రర్’ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  YSRCP  rajasyamala yagam  KCR  Nellore  Bangalore mirror  andhra pradesh  politics  

Other Articles