AIADMK distribute tokens to women and replace with cash later టోకన్లతో నగదు మార్పిడి.. ఎన్నికల సిత్రం

Aiadmk distribute tokens during ops son ravindranath election campaign

AIADMK, distribute tokens, replace tokens with cash, Tamil Nadu deputy CM O.Panneerselavam, OPS son Ravindranath, Theni MP candidate Ravindranath, Election campaign, Theni parliamentary constituency, opposition parties, IT officials. viral video, video viral, Tamil Nadu, politics

A video is doing round in the net which shows AIADMK leaders distribute tokens during OPS son and Theni MP candidate Ravindranath kick starts Election campaign in his parliamentary constituency. opposition parties criticise IT officials.

ITEMVIDEOS: అధికారుల కళ్లు కప్పేందుకు అడ్డదారులు.. ఐటీ వారికీ పట్టేనా..

Posted: 03/30/2019 03:28 PM IST
Aiadmk distribute tokens during ops son ravindranath election campaign

ఎలక్షన్ కమిషన్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఓటర్లకు నగదు పంపిణీ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే తమిళనాడులోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లకు పెట్రోల్ కోసం టోకన్లు పంచుతున్నారన్న వార్తలు కలకలం రేపగా, ఎన్నికల అధికారులు వాటిపై నిఘా పెట్టారు. అయితే తాజాగా తమిళనాడు నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న మహిళలకు ఎంచక్కా డబ్బులిస్తున్నారు. అదేంటి ఎన్నికల కోడ్ అమల్లో వుండగా, డబ్బులు ఇవ్వకూడదన్న నిబంధనలు వున్నాయి కదా.. అంటారా.

ఎన్నికలంటేనే జమ్మికులు.. అధికారులకే కాదు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు కార్యకర్తలకు కూడా తెలియకుండా డబ్బులు పంచే తంతు. అయితే డబ్బులు తీసుకున్నవాళ్లంతా ఓట్లు వేస్తారా.? అంటే అదీ అనుమానమే. కానీ నూటికి యాభైశాతమైనా వేస్తారనే నాయకులు విశ్వసిస్తుంటారు. ఎందుకంటే అలా పంచుతూ అపారమంత అనుభవం సంపాధించారు మరీ. తమ పార్టీ అభ్యర్థి ప్రచారం వుందనగానే రంగంలోకి దిగుతున్న తృతీయశ్రేణి నేతలు యధేశ్చగా డబ్బుల పంఫీణీ చేస్తున్నారు. అదెలా సాధ్యం.. అంటే అందులో కూడా కొత్త పుంతలు తొక్కుతున్నారు.

ఇన్నాళ్లు తమ తరపున ప్రచారం నిర్వహించిన కార్యకర్తలకు హోటళ్లలో లేదా మద్యం దుకాణాల్లో టోకన్లుతో వారికి మద్యం, బోజనం కల్పించేందుకు నేతలు వినియోగించిన చీటీలు.. టోకన్లు.. ఇప్పడు ఏకంగా డబ్బులు తీసుకోవాడానికి కూడా వినియోగిస్తున్నారు. తాజాగా తమిళనాడు ఎన్నికల పర్వంలో మహిళలకు మంచి డిమాండ్ వుంది. గడప, గడపకూ తిరిగి బొట్టు పెడితే ఓ రేటు, నేతలు వచ్చినప్పుడు హారతి పడితే ఓ రేటు పలుకుతోంది. అయితే ఏకంగా తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తనయుడు పోటీ చేస్తున్న తైనీ జిల్లాలో చోటుచేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

అన్నాడీఎంకే నుంచి థేని పార్లమెంటు అభ్యర్థిగా రవీంద్రనాథ్ రంగంలోకి దిగారు. దీంతో ఈ నియోజకవర్గంపై తమిళనాడు వ్యాప్తంగా అసక్తి నెలకోంది. కాగా ఎన్నికల ప్రచారాన్ని మంచి ముహూర్తం చూసుకుని ప్రారంభించిన రవీంధ్రనాథ్ కోసం అన్నాడీఎంకే నేతలు కొత్త పద్ధతిని అవలంభించారు. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ప్రచారం చేస్తే ఓ రేటు, నేతలు వచ్చినప్పుడు వారికి హారతి పడితే మరో రేటు ఫిక్స్ చేశారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని ఓ ప్రాంతానికి వచ్చిన ఆయనకు మహిళలు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతం పలికారు.

హారతి ఇచ్చేందుకు తీసుకొచ్చిన మహిళలకు రూ.200 చొప్పున ఇస్తామని ముందుగానే హామీ ఇచ్చారు. ఇందుకోసం ఎటువంటి పొరపాట్లు జరగకుండా హారతి ఇచ్చే మహిళలకు ముందుగానే టోకెన్ల వంటివి పంపిణీ చేశారు. కార్యక్రమం ముగిశాక.. ఆ టోకెన్లు, హారతి పళ్లాలు ఇచ్చి మహిళలు రూ.200 తీసుకోవడాన్ని కొందరు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK  tokens  cash  OPS son  Ravindranath  Theni  IT officials. viral video  Tamil Nadu  politics  

Other Articles