1000 railway stations are now Wi-Fi enabled దేశంలోని 1000 రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై

Good news free wi fi now available at 1000 indian railway stations

Free wifi services, 1000 Railway Stations, indian railways, Nation wide railway stations, wifi, railtel, railwire, piyush goyal, railway station, india, Indian Railways, RailTel, Rural railway, National news, politics

Good news for Indian Railways passengers! Now, you can enjoy railways' free WiFi service at 1000 stations. RailTel, the Indian Railways' arm entrusted with the implementation of WiFi, has successfully completed work of turning 1000 railways stations

గుడ్ న్యూస్: దేశంలోని 1000 రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై

Posted: 03/29/2019 06:33 PM IST
Good news free wi fi now available at 1000 indian railway stations

భారత రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను వై-ఫై జోన్లగా మార్చేసింది. ఇక నుంచి రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఉచితంగా వై-ఫై సర్వీసు వినియోగించుకునే వసతిని కల్పించింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (మిని రత్నా CPSU) దేశవ్యాప్తంగా వెయ్యి స్టేషన్లలో ఫ్రీ వై-ఫై జోన్లను ఏర్పాటు ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. రెండు సంవత్సరాల మూడు నెలల్లో రైల్ వైర్ వై-ఫై ప్రాజెక్టును పూర్తి చేసి దాదాపు వెయ్యి రైల్వే స్టేషన్లను వై-ఫై జోన్లుగా మార్చేశారు.

ఇప్పటివరకూ రైల్ టెల్ 1000 స్టేషన్లలో వై-ఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. జనవరి 2016లో ముంబై సెంట్రల్ స్టేషన్ నుంచి రైల్ టెల్ వై-ఫై సర్వీసు ప్రాజెక్టును ప్రారంభించింది. వై-ఫై సర్వీసు సౌకర్యం అందుబాటులోకి వచ్చిన 1000 రైల్వే స్టేషన్ గా ముంబైలోని సెంట్రల్ రైల్వే రేరోడ్ స్టేషన్ రికార్డు ఎక్కింది. భవిష్యత్తులో మరెన్నీ స్టేషన్లలో వైఫై నెట్ వర్క్ ను విస్తరించే దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది.

ఇక త్వరలోనే అన్ని రైల్వే స్టేషన్లలో ఉచితంగా వేగవంతమైన రైల్ వైర్ వై-ఫై సర్వీసు ప్రయాణికులు వినియోగించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో కూడా వై-ఫై సర్వీసులను అందుబాటులోకి రానుంది. తద్వారా డిజిటల్ పరంగా హబ్ గా తీర్చిదిద్దాలని రైల్వే శాఖ యోచిస్తోంది. రైల్ వైర్ అనే రిటైల్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ నుంచి రైల్వే ప్రయాణికులకు స్టేషన్లలో ఉచితంగా వై-ఫై నెట్ వర్క్ ను అందించనున్నారు. ప్రయాణికుల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. కేవైసీ ఆధారంగా ఉచితంగా వైఫై సర్వీసును సులభంగా యాక్సస్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.

రైల్ టెల్.. హైస్పీడ్ వై-ఫై సౌకర్యాన్ని పలు రైల్వే స్టేషన్లలో అందించింది. టెక్నాలజీ పార్టనర్ గూగుల్, రేడియా యాక్సస్ ఆధారంగా రైల్ టెల్ ఈ వై-ఫై సదుపాయాన్ని ఆయా స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని రైల్వే స్టేషన్లలో డిజిటల్ వైఫై సర్వీసులను అందించడమే లక్ష్యంగా రైల్ టెల్ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం వై-ఫై సదుపాయం ఉన్న రైల్వే స్టేషన్లలో ఫిబ్రవరి 2019 నెలలో మొత్తం 1,15,77,141 మంది యూనిక్ యూజర్లు ఉచితంగా వైఫై సర్వీసును వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Free wifi services  Railway Stations  india  Indian Railways  RailTel  Rural railway  

Other Articles