congress former mlc arikela narsa reddy joins TRS కాంగ్రెస్ కు మరో షాక్.. కారెక్కిన అరికెల నర్సారెడ్డి

Congress former mlc arikela narsa reddy joins trs

Arikela Narsireddy joins TRS, Congress former MLC joins TRS, Lok sabha Elections, Arikela Narsireddy, Nizamabad, KTR, KCR, Telangana CM, Congress, Telangana, politics

Congress Leader and former MLC Arikela Narsireddy from NIzambad joins TRS in the Presence of TRS working president KT Rama Rao at camp office on Friday.

కాంగ్రెస్ కు మరో షాక్.. కారెక్కిన అరికెల నర్సారెడ్డి

Posted: 03/29/2019 05:13 PM IST
Congress former mlc arikela narsa reddy joins trs

నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో తన సోదరి కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా ఏకంగా 180 మంది ఎర్రజోన్న, పసుపు రైతులు పోటీ చేస్తున్న నేపథ్యంలో అమె విజయం గతంలో మాదిరిగా నల్లేరుపై నడక మాత్రం కాదని తేలిసిపోతుంది. దీంతో రంగంలోకి దిగిన టీఆర్ఎస్ శ్రేణులు అమె విజయానికి అందివచ్చే ప్రతీ ఒక్కరిని పార్టీలోకి కలుపుకుంటూ ముందకువెళ్తున్నారు. ఐదేళ్ల పాటు అధికార పార్టీ అండదండలతో తమ పనులను కూడా ఎంచక్కా చక్కబెట్టుకోవచ్చని నేతలు కూడా పిలుపు రాగానే అలస్యం చేయకుండా వెళ్లి గులాభి కండువా కప్పుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా, మంత్రి పదవులు వెలగబెట్టిన నేతలే ఇలా గులాబి గూటికి చేరి స్వాంతన పోందుతున్న తరుణంలో ఇక మాజీ మాత్రం తమకు అందివచ్చిన అవకాశాన్ని ఎలాజార్చుకుంటారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అరికెల నర్సారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.  టీఆర్ఎస్  పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు  పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. త్వరలో తన అనుచరులను, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని టీఆర్ఎస్ పార్టీలో చేర్పించేందుకు  భారీ ఎత్తున ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు.

నర్సారెడ్డి టీఆర్ఎస్ లో చేరటం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్, పార్టీ నర్సారెడ్డికి  సముచిత గౌరవం కల్పిస్తుందని చెప్పారు. నిజామాబాద్ కు చెందిన అరికెల నర్సారెడ్డి గతంలో టీడీపీలో ఉండగా ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. 2016 లో టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా ఆయన సేవలందించారు. టీఆర్ఎస్ లో చేరటంపై  నర్సారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృధ్ది సంక్షేమ పధకాలు  నచ్చి  పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.  రాబోయే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 స్ధానాలను గెలుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arikela Narsireddy  kavitha  former MLC  KTR  KCR  nizamabad  Congress  Telangana  politics  

Other Articles