Pawan helicopter issue – Jana Senani fires at YCP రాయలసీమలో అడుగుపెడితే.. మీ వెన్నులో వణుకెందుకు.?: పవన్

Pawan kalyan furious about his chopper permission rejected

pawan kalyan, YSRCP, BJP, TDP, JanaSena, Rayalaseema, chopper, permission, janasena, Nandyal, nandikotkur, adoni, emmiganur constituencies, Andhra Pradesh, Politics

Janasena Chief Pawan Kalyan fires at YCP, as the police denied the permission for his chopper to travel in rayalaseema. Pawan blamed BJP and YS Jagan behind his chopper permission rejection.

రాయలసీమలో అడుగుపెడితే.. మీ వెన్నులో వణుకెందుకు.?: పవన్

Posted: 03/29/2019 12:31 PM IST
Pawan kalyan furious about his chopper permission rejected

జ‌న‌సేన పార్టీ తొలిసారిగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్రంలోని యువతను పెద్దస్థాయిలో అకట్టుకుంటుంది. ఈ క్రమంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాయసీమ ప్రాంతంలో పర్యటనకు బ్రేకులు పడ్డాయి. ఆయన పర్యటనకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. చివరి క్షణంలో పవన్ కల్యాణ్ పర్యటన వివరాలను తెలుపుతూ అనుమతి కోరారని, ఏర్పాట్లు చేయడంలో అప్పటికే ఆలస్యమయ్యిందని దీంతో అనుమతని నిరాకరించామని పోలీసులు తెలిపారు.

దీనిపై తీవ్రంగా స్పందించిన పవన్.. తాను రాయలసీమలో అడుగుపెట్టకుండా కొన్ని దుష్టశక్తులకు వెన్నులో వణుకు పుట్టి.. కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. తన హెలికాప్టర్ కు అనుమతి రద్దు చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ రద్దు ఆదేశాలను జగన్ ఇచ్చారా? లేక, బీజేపీ నేతలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. మీరు నిజంగా నిజాయితీ పరులే అయితే.. తన పర్యటనలను అడ్డుకోవడం ఎందుకని.. ఎవరెన్ని రకాలుగా ప్రచారం చేసినా.. మీకేంటి నష్టం.? అని నిలదీశారు.

జగన్ పై బోల్డన్ని కేసులు ఉన్నాయని, రేపటి రోజున కేంద్ర ప్రభుత్వం మళ్లీ వాటిని తిరగదోడి.. మీ అధికారాలకు కత్తెర పెడితే..  రాష్ట్రానికి మీరెలా న్యాయం చేస్తారని జగన్‌ ను ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు. తాను ఎవరితో మాట్లాడితే వారే తన భాగస్వాములని అంటున్నారని, నిజానికి జగన్ అమిత్ షాలే రహస్య భాగస్వాములని అన్నారు. జగన్‌ లా తన వద్ద డొంకతిరుగుడు వ్యవహారాలు ఉండవని స్పష్టం చేశారు. వైసీపీ నేతల మీద తనకు వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. కొన్ని రోజుల ముందు తనను టీఆర్ఎస్ భాగస్వామినని.. ఇప్పుడు టీడీపీ భాగస్వామినని ఎవరికి ఇష్టమెచ్చినట్టుగా వారు అన్వయిస్తున్నారని విరుచుకుప్డడారు.

చిత్తూరు జిల్లా మదనపల్లె, అనంతపురం, ధర్మవరం, కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న పవన్ మాట్లాడుతూ.. తనను యాక్టర్ అని సంబోధించిన జగన్ పై ధీటుగా విరుచుకుపడ్డారు. తాను రాజకీయాల్లోకి రాకముందు సినీరంగం నుంచి ప్రజలకు సేవచేయడానికి వచ్చానని, ఔను తాను యాక్టర్‌నని అన్నారు. అయితే జగన్ రాజకీయాల్లోకి రాకముందు ఎక్కడి నుంచి వచ్చాడో ప్రజలు అలోచించాల్సిన అవసరంముందన్నాడు. దేశానికి ఏం ఘనకార్యం చేశాడని, ప్రజలకు ఏ కష్టాలు తీర్చాడని ఆయన రెండేళ్లు జైల్లో ఉండి వచ్చాడో జగన్ చెప్పగలడా అని పవన్ ప్రశ్నించారు.

తాము అధికారంలోకి వస్తే రాయలసీమలో ఏ పరిశ్రమ ఏర్పాటైనా స్థానికులకు 60 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఉద్యోగాల దరఖాస్తుల ద్వారా వసూలు చేసే సొమ్ముతో నిరుద్యోగ భృతి ఇస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. జనసేన అధికారంలోకి వస్తే అన్ని ఉద్యోగాలకు ఒకేసారి ఫీజు చెల్లించే విధానాన్ని తీసుకొస్తామన్నారు. పదో తరగతి వరకు చదువుకున్న 25 వేల మందిని పోలీసు సహాయకులుగా నియమిస్తామని పవన్ హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  election campaign  kurnool  Andhra Pradesh  Politics  

Other Articles