CBI team to leave for UK for Nirav Modi నిరవ్ మోడీ అప్పగింత కోసం.. లండన్ కు భారత అధికారులు

Cbi team likely to leave for london for nirav modi s case hearing

CBI, London, Nirav Modi case hearing, Punjab National Bank fraud, Mehul Choksi fraud case, UK, India, Westminster Magistrates' Court, Marie Mallon, Nirav Modi, Mehul Choksi, london court, PNB scam, politics, Indian news

A CBI team is likely to leave for London to assist local authorities in the extradition case of fugitive diamantaire Nirav Modi whose bail plea will come for hearing before a court there on Friday, officials said.

నిరవ్ మోడీ అప్పగింత కోసం.. లండన్ కు భారత అధికారులు

Posted: 03/27/2019 03:31 PM IST
Cbi team likely to leave for london for nirav modi s case hearing

బ్యాంకుల్లోని ప్రజాధానాన్ని రుణాలుగా పొంది ఉద్దేశపూర్వకంగా వాటిని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మరో అర్థిక నేరస్థుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కోసం భారత అధికారులు లండన్ వెళ్లనున్నారు. నిరవ్ మోడీ అప్పగింత కేసు విషయంలో సీబీఐ-ఈడీ సంయుక్త బృందం త్వరలో లండన్ కు బయల్దేరనుంది. పీఎంఎల్ఏ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ కు ఇటీవల లండన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయగా.. కోర్టు ఆదేశాల మేరకు అక్కడి పోలీసులు నీరవ్ ను ఈ నెల 29 వరకు జుడీషియల్ రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.

కాగా తన జుడీషియల్ రిమాండ్ నేపథ్యంలో నీరవ్ మోడీ.. బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై లండన్ కోర్టులో విచారణకు రానుంది. అయితే నిరవ్ మోడీ కేసు విషయంలో లండన్ అధికారులకు సహకారం అందించేందుకు భారత్ కు చెందిన సీబీఐ-ఈడీ అధికారులతో కూడిన సంయుక్త బృందం లండన్ వెళ్లనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సీబీఐ, ఈడీ నుంచి జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులు నీరవ్ అప్పగింతకు సంబంధించిన పత్రాలతో లండన్ కు సిద్ధమవుతున్నట్టు అధికారి ఒకరు చెప్పారు.

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారి కూడా నీరవ్ మోడీ భార్య అమికి సంబంధించి ఆస్తుల అటాచ్ మెంట్ పై దాఖలైన లేటెస్ట్ ఛార్జ్ షీట్ ను కూడా తీసుకెళ్లననున్నారు. లండన్ కు వెళ్లగానే ముందుగా సీబీఐ-ఈడీ బృందం పలువురు అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వారికి నీరవ్ కేసుకు సంబంధించి సేకరించిన తాజా వివరాలను వివరించనున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 2 బిలియన్లు రుణాలుగా తీసుకుని మోసం చేసినందుకు వజ్రాల వ్యాపారి, అతని మామ మెహల్ చోస్కీపై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nirav Modi  Mehul Choksi  CBI  Westminster court  london court  PNB scam  politics  Indian news  

Other Articles