PM addresses Nation, Says No International Law Violated స్పెస్ పవర్ గా అవతరించిన భారత్.. మిషన్ శక్తి విజయవంతం..

India becomes 4th nation to add anti satellite weapon to arsenal

anti-satellite weapon, BJP, DRDO, India, ISRO, Lok Sabha elections 2019, Mission Shakti, Narendra Modi, prime minister, politics

India has become the fourth nation in the world after United States, China and Russia to demonstrate anti-satellite missile capability by shooting down a live satellite.

స్పెస్ పవర్ గా అవతరించిన భారత్.. మిషన్ శక్తి విజయవంతం..

Posted: 03/27/2019 02:25 PM IST
India becomes 4th nation to add anti satellite weapon to arsenal

ప్రపంచ అగ్రగామి దేశాలుగా బాసిల్లుతున్న అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సాధించిన మరో అద్భుత ఘనతను ఇండియా కూడా సాధించింది. శాస్త్రసాంకేతిక రంగాల్లో విప్లవాత్మక అభివృధ్దిని సాధించిన క్రమంలో అదే సాంకేతిక మద్దతుతో అంతరిక్ష రంగంలో కూడా భారత్ సత్తా చాటింది. భారత్ కూడా స్పేస్ పవర్ గా అవతరించింది. ఈ మేరకు భారత ప్రధనమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ప్రకటించారు.

ఈ మేరకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ… ప్రపంచంలో స్పేస్ పవర్ గా మారిన నాలుగో దేశం భారత్ అని పేర్కొన్నారు. మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలో కాలం చెల్లిన శాటిలైట్ ను కూల్చివేశారని ప్రకటించారు. ‘మిషన్ శక్తి’ పేరుతో చేసిన అత్యంత కఠినమైన ఈ ఆపరేషన్ ను భారత్ విజయంవంతంగా పూర్తి చేసిందన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఇండియా స్పేస్ పవర్ గా ఎదిగిందని ఆయన ప్రకటించారు.

ఈ విజయంతో భారత్ మరింత సురక్షితంగా మారిందని పేర్కొన్నారు. ప్రపంచ శాంతిని భారత్ కోరుకుంటోందని, యుద్ధ వాతావరణ ఏర్పడటం తమ ఉద్దేశ్యం కాదన్నారు. అంతరిక్షంలో ఓ శాటిలైట్ ను మన శాస్త్రవేత్తలు యాంటీ శాటిలైట్ మిసైల్ ద్వారా కూల్చివేశారని, దీంతో ఈ ప్రయోగం విజయవంతమైందని, ఇంత టెక్నాలజీని సాధించిన శాస్త్రవేత్తలను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ అంశమని అన్నారు.

మిషన్ శక్తి ఏంటీ!

మ‌న ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు లో-ఎర్త్ ఆర్బిట్ ఉప‌గ్ర‌హాన్ని కూల్చేశారు. భూమికి 300 కిలోమీట్ల‌ర ఎత్తులో పేల్చివేశారు. యాంటీ శాటిలైట్ (ఏ శాట్) మిస్సైల్ ద్వారా ఎల్ఈవో(లోయ‌ర్ ఎర్త్ ఆర్బిట్) ఉప‌గ్ర‌హాన్ని నేల‌కూల్చారు.  కేవలం 3 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ పూర్తి చేశారు. ముందుగా ఓ లోయర్ ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపారు. ఆ తర్వాత మిసైల్స్ ద్వారా దాన్ని కూల్చేశారు. భవిష్యత్ తో శాటిలైట్ల ద్వారా జరిగే  దాడులను, గూఢచర్యాన్ని ఎదుర్కొనేందుకు ఈ ప్రయోగం చేశారు. ఇందులో సక్సెస్ అయ్యారు డీఆర్డీఓ శాస్త్రవేత్తలు. అంతరిక్షంలోని శాటిలైట్లను కూల్చివేయగల సామర్ధ్యం ఉన్న మిస్సైల్స్ ను తయారు చేయటం భారత్  ఘనత.

300 కిలోమీటర్ల ఎత్తులో.. అంతరిక్షం లక్ష్యాలను కూడా ఛేదించగల మిస్సైల్స్ ను తయారు చేయటం DRDO సాధించిన అద్బుతం. దేశంపై నిఘా పెట్టే శాటిలైట్లను కూల్చివేయటానికి కూడా ఈ టెక్నాలజీ  ఉపయోగపడుతుంది. శత్రుదేశాలు అంతరిక్ష యుద్ధానికి దిగితే.. సమర్ధవంతంగా ఎదుర్కోవటానికి ఉపయోగ    పడుతుంది. ప్రస్తుతం ఇదే చేసింది భారత్. ఏశాట్ టెక్నాలజీని ఉపయోగించిన తొలి దేశం అమెరికా. 1958లోనే అమెరికా ఈ ఘనత సాధించింది. ఆ తర్వాత 1964లో రష్యా, 2007లో చైనా ఈ ఘనత సాధించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles