Setback for TRS in front of Loksabha elections లోక్ సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ

Setback for trs in legislative council polls

Karimnagar-Nizamabad-Adilabad-Medak Graduates Constituency, jeevan reddy, Warangal-Khammam-Nalgonda constituency, narsireddy, MLC elections, Congress, CPI (M), TRS party, Hyderabad, T Jeevan Reddy, Narsi Reddy, Telangana MLC Elections 2019, MLC Elections Results 2019, Telangana, politics

Ruling TRS in Telangana received a setback with the party backed candidates losing elections to three seats of the Legislative Council. Two outgoing members of the upper house of the state legislature were among the candidates who lost the elections.

అధికార టీఆర్ఎస్ కు షాకిచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు

Posted: 03/27/2019 11:58 AM IST
Setback for trs in legislative council polls

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల నుంచి కాంగ్రెస్ కు దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతున్న విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం టీఆర్ఎస్ మ‌ళ్లీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంతో కాంగ్రెస్ ప‌రిస్థితి తెలంగాణ‌లో మ‌రింత దారుణంగా త‌యారైంది. టీఆర్ఎస్ ప్ర‌లోభాలకు లొంగిన కీల‌క నేత‌లంతా గులాబి గూటికి క్యూ క‌ట్ట‌డంతో కాంగ్రెస్ అధిష్టానానికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. పార్టీలో వున్న ప‌లువురు కీల‌క నేత‌లు పార్టీ మారుతుండ‌టంతో ఏం చేయాలో దిక్కుతోచ‌ని కాంగ్రెస్‌కు అధిష్టానానికి పెద్ద ఉపశమనాన్ని అందించాయి ఎమ్మెల్సీ ఎన్నికలు.

గత ఏఢాది డిసెంబర్ లో ముందస్తుగా వచ్చిన అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిన నేతలే ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ జాతకాన్ని మరోమారు పరీక్షించుకున్నారు. వారే ఏకంగా విజయాన్ని సాధించి ఎమ్మెల్సీ పీఠాన్ని అధిరోహించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊతం లభించినట్లైయ్యింది. ఈ ఎన్నిక‌ల్లో గెలుస్తామా? అని అనుమానంతోనే బ‌రిలోకి దిగిన కాంగ్రెస్ ఖాతా తెర‌వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇక ఇప్పటికే పార్లమెంటు ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రచార జోరు పెంచింది.

ఈ సందర్భంగా కేటీఆర్ పలు సభల్లో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిన వ్యక్తులనే మళ్లీ పార్లమెంటు బరిలోకి దింపారని, భువనగిరలో చెల్లని రూపాయి నల్గొండలో ఎలా చెల్లుతుందని వ్యంగస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఆ వ్యాఖ్యలు వారికే తిప్పికోట్టినట్లు చేసింది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికలలో చెల్లని రూపాయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలా చల్లిందని కాంగ్రెస్ నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పై సెటైర్లు వేస్తున్నారు.

క‌రీంన‌గ‌ర్‌, అదిలాబాద్‌, నిజామాబాద్‌, మెద‌క్ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌ల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జీవ‌న్‌రెడ్డి విజ‌యం సాధించారు. స‌మీప టీఆర్ఎస్ ప్ర‌త్య‌ర్థి చంద్ర‌శేఖ‌ర్ పై 39,430 ఓట్ల మెజారిటీతో జీవ‌న్‌రెడ్డి విజ‌యం సాధించారు. ఈ స్థానం నుంచి 17 మంది పోటీలో నిల‌వ‌గా, మొత్తం 1,15,458 ఓట్లు పోల‌య్యాయి. కాగా మొద‌టి ప్రాధాన్య‌త ఓటు ద్వారానే జీవ‌న్‌రెడ్డి విజ‌యం సాధించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. మొత్తం 14 టేబుళ్ల‌పై 9 రౌండ్ల‌లో అధికారులు ఓట్లు లెక్కించారు. పార్టీ నేత‌ల ఫిరాయింపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న కాంగ్రెస్ కు జీవ‌న్‌రెడ్డి విజ‌యం కొత్త ఆశ‌లు చిగురింప‌జేసింద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇక నల్లగొండ-ఖమ్మం- వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఓటమి పాలయ్యారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి సీపీఎం పార్టీ తరుపున పోటీ చేసిన విజయం సాధించారు. ఆయన పూల రవీందర్‌పై 2,829 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 20,888 వుండగా, ఎన్నికల్లో 18,885 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వీటిలో 858 ఓట్లు చెల్లనివిగా గుర్తించిన అధికారులు.. 18027 ఓట్లను పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో విజయానికి 9,014 ఓట్లు అవసరమని నిర్ధారించారు. కాగా, తొలి ప్రాధాన్య ఓట్లలో టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి 8,976, పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్‌కు 6,279 రాగా, ద్వీతీయ ప్రాధాన్యత ఓట్లుతో నర్సిరెడ్డి విజయం సాధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS party  Hyderabad  T Jeevan Reddy  Narsi Reddy  Telangana MLC Elections 2019  Telangana  politics  

Other Articles