Rahul Gandhi big promises to poor కాంగ్రెస్ పెద్ద హామీ: పేదల బ్యాంకులకు ఏడాదికి రూ.72 వేలు

Congress big promise to give rs 72 000 annually to 25 crore poor

rahul gandhi, congress president, rahul gandhi press conference, congress president rahul gandhi, rahul gandhi updates, rahul gandhi news, election 2019 updates, lok sabha election 2019 congress, Delhi Congress, press conference in New Delhi, income support, poor families, congress poor families, congress income support, Rahul Gandhi, minimum income, minimum income to poorest families, Rs 72,000 annual income, Lok Sabha election 2019, minimum income guarantee, congress, Rahul Gandhi promises minimum income guarantee, Rs 72,000 per year, Congress president Rahul Gandhi, minimum basic income guarantee scheme, lok sabha poll 2019, Rs 72,000 per annum, Rahul Gandhi Minimum Income, Rahul Gandhi news, politics

Congress president Rahul Gandhi announced the party's big poll promise this season - Rs 72,000 annual income support for 20 per cent of the poorest families in the country.

కాంగ్రెస్ పెద్ద హామీ: పేదల బ్యాంకులకు ఏడాదికి రూ.72 వేలు

Posted: 03/25/2019 03:45 PM IST
Congress big promise to give rs 72 000 annually to 25 crore poor

సార్వత్రిక ఎన్నికలకు వెళ్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అత్యంత పెద్ద హామీని దేశంలోని పేదలపై కురిపించింది. దేశంలోని పేదరికాన్ని తమ పార్టీ ఖచ్చితంగా తొలిగించే దిశగా చర్యలు తీసుకుంటుందని.. అందుకు తాము అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకాన్ని ఖచ్చితంగా అమలుచేసి తీరుతామని ఎన్నికల హామీని కురిపించింది. ఈ మేరకు ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ న్యూఢిల్లీ వేదికగా ఈ హామీని గురించిన వివరాలను తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన అన్ని లెక్కలు పూర్తి అయినట్లు తెలిపారు.

ఈ పథకం వివరాలను రాహుల్ ప్రకటించారు. దేశంలోని 20 శాతం మంది అత్యంత పేద కుటుంబాలకు వారి బ్యాంకు ఖాతాల్లో ఈ పథకం కింద ప్రతి ఏటా రూ.72,000 జమ చేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా దేశంలోని 25కోట్ల మంది ప్రజలు నేరుగా లబ్ది పొందుతారని తెలిపారు. ప్రపంచంలో ఇలాంటి పథకం మరెక్కడా లేదన్న ఆయన ఆర్థికంగా ఇది సాధ్యమే అని తెలిపారు. అయితే తమవి ఎన్నికల సందర్భంగా ఇచ్చే ఉత్తత్త హామీలు కావని చెప్పిన ఆయన పరోక్షంగా బీజేపిని టార్గెట్ చేశారు.

అంతేకాకుండా ప్రతి కుటుంబానికి నెలకు రూ.12వేలు ఆదాయం పొందేలా చేస్తామన్నారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ(మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం)ని తాము గతంలో సమర్థవంతంగా అమలుచేసిన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు.దేశంలో పేదరికాన్ని పారదోలుతామన్నారు.ఇదొక చారిత్రక పథకం అని తెలిపారు.ఈ పథకం వివరాలు మీడియాకు వెల్లడించిన తర్వాత.. ఆశ్చర్యపోయారా అంటూ రాహుల్ ప్రశ్నించారు.తొలి విడత పోలింగ్ నామినేషన్లకు చివరి రోజు రాహుల్ ఈ చారిత్రక పథకం వివరాలను ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles