Nagari MLA Roja discloses her assets details వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా అస్తుల వివరాలివే..

Yspcp party fire brand and mla roja discloses her assets details

YSRCP fire brand Roja, Naraei MLA Roja, roja declares her assets, roja husband selvamai assets, assets on roja son and daughter, Roja Assets, RK Roja, Nagari, MLA Roja, AP Politics, Andhra Pradesh, Politics

YSPCP party fire brand and Nagari MLA Roja discloses her assets details as Rs.7 crores along with 7 cars. out of which Rs.4.64 worth is of ummovable assets.

వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా అస్తుల వివరాలివే..

Posted: 03/25/2019 02:57 PM IST
Yspcp party fire brand and mla roja discloses her assets details

నగరి ఎమ్మెల్యే రోజా వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రోజా సమర్పించిన అఫిడవిట్లో అమె పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఎమ్మెల్యే అయివుండి కూడా అమెకు అప్పులున్నాయని అమె తన అఫిడెవిట్ లో పోందుపర్చారు. ఇక తన భర్త పేరును ఎలాంటి స్థిరాస్థి లేదని వివరాలను తెలిపిన ఆమె.. ఆయన పేరున 58 లక్షల విలువైన చరాస్థి మాత్రం వుందని పేర్కోన్నారు.

ఇద్దరు పిల్లల పేరిట బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నట్లు తెలియజేశారు. ఆసక్తికరంగా తనకు ఏడు కార్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో ప్రస్తావించారు రోజా. ఆ కార్ల వివరాలను పొందుపరిచారు. అలాగే తన పేరుమీద అప్పులు కూడా ఉన్నట్లు ప్రస్తావించారు. రోజా తన పేరు మీద మొత్తం రూ.7,38,38,430 ఆస్తి ఉందన్నారు. అందులో స్థిరాస్తి రూ.4,64,20,669.. చరాస్తి రూ. 2,74,17,761.. అప్పులు రూ.49,85,026. భర్త సెల్వమణి పేరుతో ఎలాంటి స్థిరాస్తి లేదని.. చరాస్తి రూ.58,02,953.. అప్పులు రూ.22,00,000 ఉన్నట్లు చూపించారు.

వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తుల విలువ: 58,80,000.. ఇక కుమార్తె అనూష, కుమారుడు కృష్ణ కౌశిక్‌ పేరుతో ఉన్న రూ.50,56,191 డిపాజిట్లు ఉన్నట్లు తెలిపారు. రోజా కార్ల విషయానికి వస్తే.. తనకు మహీంద్రా, ఫోర్డ్‌ ఇండీవర్‌, చావర్‌లెట్‌, ఇన్నోవా క్రిష్టా, ఫార్చ్యునర్‌, హూండా స్ల్పెండర్‌, మహీంద్రా స్కార్పియో ఉన్నాయన్నారు.ఈ కార్ల విలువ రూ.1,08,16,564 ఉంటుందని పొందుపరిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP fire brand  Roja Assets  RK Roja  Nagari  MLA Roja  Andhra Pradesh  Politics  

Other Articles

Today on Telugu Wishesh