YS sujatha reddy compliants about CM statements to AP CEO ‘‘వివేకా హత్యకేసుపై సీఎం వ్యాఖ్యలు ప్రభావితం’’

Ys sujatha reddy compliants about cm statements to ap ceo on her father murder case

YS sujatha reddy, YS Vivekananda Reddy Murder case, CM Chandrababu, CM statements, AP CEO Dwivedi, SIT Investigation, kadapa, Andhra Pradesh politics, crime

YS sujatha reddy, daughter of YS Vivekananda Reddy compliants about Chief Minister Chandrababu statements to AP CEO on her father murder case, she says CM statements are reflection on SIT Investigation.

వివేకా హత్యకేసుపై సీఎం వ్యాఖ్యలు ప్రభావితం: సుజాతారెడ్డి

Posted: 03/21/2019 05:23 PM IST
Ys sujatha reddy compliants about cm statements to ap ceo on her father murder case

వైఎస్సార్ పిసీ అధినేత జగన్ బాబాయ్.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం రేపగా తాజాగా, ఈ కేసు విచారణను ప్రభావితం చేసేలా.. రాజకీయ నేతల వ్యాఖ్యలు వున్నాయని వైఎస్ వివేకానంద రెడ్డి తనయ సునితారెడ్డి అరోపించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ తీరుపై ప్రభావం చూపేలా ప్రత్యర్థి పార్టీల నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని వివేకా కూతురు సునీతా రెడ్డి ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు.

అమరావతికి చేరుకున్న ఆమె సచివాలయంలో ఎన్నికల అధికారి ద్వివేదిని కలిసిన ఆమె.. సిట్ విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబే కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారని సునీతా రెడ్డి తన ఫిర్యాదులో చెప్పారు. సీఎం వ్యాఖ్యలు కేసు దర్యాప్తు చేస్తున్న విచారణ అధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

వివేకా హత్య కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన సునీతా రెడ్డి.. వివేకా హత్య  తర్వాత టీడీపీ నేతల వ్యాఖ్యలు ఉన్న పేపర్ కటింగ్స్ ను సీఈవో ద్వివేదికి ఇచ్చారు. సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని, దోషులకు శిక్షపడేలా చేయాలని సీఈవోకి.. సునీతా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ  విషయమై త్వరలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. సునీతా రెడ్డి తన భర్త రాజశేఖరరెడ్డితో కలిసి సచివాలయానికి వచ్చారు.

వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మార్చి 15వ తేదీన తెల్లవారుజామున పులివెందులలోని ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. వివేకా హత్య.. రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వివేకాను చంపింది టీడీపీ వాళ్లే అని వైసీపీ నాయకులు ఆరోపిస్తే.. మీరే చంపారు.. అని టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. వివేకా హత్య వెనుక చంద్రబాబు, లోకేష్ హస్తం ఉందని జగన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles