Kurnool mla sv mohan reddy to join ysrcp తప్పు చేశా.. తెలుసుకున్నా: ఎస్వీ మోహన్ రెడ్డి

Shock to tdp kurnool mla sv mohan reddy to join ysrcp

SV Mohan Reddy, TG Bharat, kotla surya prakash reddy, KE krishna Murty, TG Venkatesh, kurnool, TDP, YSRCP, Chandrababu, YS Jagan, Andhra Pradesh, politics

Sitting MLA from Kurnool SV Mohan Reddy gives a big shock to TDP. He says, will rectify his mistake and willing to join YSRCP according to his disciples decision.

తప్పు చేశా.. తెలుసుకున్నా: ఎస్వీ మోహన్ రెడ్డి

Posted: 03/21/2019 04:32 PM IST
Shock to tdp kurnool mla sv mohan reddy to join ysrcp

మరో పద్దెనిమిది రోజుల వ్యవధిలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో రసకందాయక మార్పులు జరుగుతున్నాయి. ఏ నేత ఎప్పుడు ఏపార్టీకి షాక్ ఇస్తున్నారో.. ఏ పార్టీలో చేరుతున్నారో కూడా తెలియని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డికి అధికార టీడీపీ పార్టీకి గట్టి షాక్‌ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేసిన వైఎస్సార్ సీపీలో చేరదామన్న తన కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

వైఎస్‌ జగన్ తమకు ఎలాంటి అన్యాయం చేయలేదని, తామే పార్టీ మారి అన్యాయం చేశామని ఎస్వీ మోహన్‌ రెడ్డి అవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ తప్పును ఇప్పుడు తెలుసుకున్నామని, చంద్రబాబు మోసాన్ని, టీడీపీ విధి విధానాలను ఎండగడతామని ఆయన తెలిపారు. కర్నూలులో వైసీపీ పార్టీ అభ్యర్థి హఫీజ్‌ ఖాన్ ను గెలిపించుకుని రాష్ట్రంలో వైఎస్‌ జగన్ ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తామని ఎస్వీ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలులో తన సత్తా ఏంటో చూపిస్తానని ఆయన సవాల్ చేశారు.

తన పోరాటం టీడీపీ నేతలపైనేనని చెప్పిన ఆయన జిల్లాలోని కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, టీజీ వెంకటేష్‌ కుటుంబాలకు వ్యతిరేకంగా ఎస్వీ కుటుంబం తరఫున ఢీ కొడతానని అన్నారు. వాళ్లు ఎంతమంది ఉన్నా భయపడేది లేదని, తమపై కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. వైసిపి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

జరగబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుని వైఎస్‌ జగన్‌కు బహుమతిగా ఇస్తామని ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. తనకోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అప్పట్లో పార్టీ మారానే కానీ, డబ్బులు, పదవులు కోసం పార్టీలు మారే సంస్కృతి కాదని అన్నారు. అయితే ఎస్వీ మోహన్ రెడ్డి వ్యాఖ్యలను టీడీపీ నేతలు తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. టిక్కెట్ దక్కకపోవడం వల్లే ఆయన నిరాశ, నిసృహలకు లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SV Mohan Reddy  kurnool  TDP  YSRCP  Chandrababu  YS Jagan  Andhra Pradesh  politics  

Other Articles