Andhra Pradesh CEO releases notification for 2019 elections తొలిదశ ఎన్నికలకు, ఏపీ అసెంబ్లీకి నోటిఫికేషన్ జారీ

Ls polls 2019 ec will announce notification for 91 seats in 1st phase

notification for 2019 elections, Gopalakrishna Dwivedi, YSR Congress party, TDP, Jana Sena, BJP, AP politics, Andhra Pradesh elections in 2019, Lok Sabha elections, Ist phase of lok sabha elections, national politics

The formal process for conducting the Lok Sabha elections will start with the issuance of notifications by the Election Commission on 91 seats in the first phase. AP Chief Election Officer Gopalakrishna Dwivedi has released the notification for 2019 general elections in AP.

తొలిదశ ఎన్నికలకు, ఏపీ అసెంబ్లీకి నోటిఫికేషన్ జారీ

Posted: 03/18/2019 01:18 PM IST
Ls polls 2019 ec will announce notification for 91 seats in 1st phase

సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ కు కేంద్రం ఎన్నికల కమిషన్ ఇవాళనోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మార్చి 21న హోలీ, 24న ఆదివారం సెలవు దినాలు కావడంతో ఆ రెండురోజులూ నామినేషన్ల స్వీకరించోమని అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో 42 లోక్ సభ స్థానాలతోపాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. నామినేషన్ల స్వీకరణకు గడువు కేవలం ఆరు రోజులు మాత్రమే అంటే ఈ నెల 25తో ముగియనుంది.

మార్చి 26న నామినేషన్లను పరిశీలిస్తారు. మార్చి 27 నుంచి 28 వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుండగా.. మే 23న ఫలితాలు వెల్లడవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది. దీంతో ఏపీ అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థులు కూడా ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు తమ నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. కాగా, 21 హోలి, 24 అదివారం సందర్భంగా ఈ రెండు రోజులు నామినేషన్ల స్వీకరించరు ఎన్నికల అధికారులు. ఇక ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091కు చేరుకుంది.

గత ఎన్నికలతో పోలిస్తే 1,72,211 మంది ఓటర్ల పెరుగుదల నమోదయ్యింది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో ఓటర్లు సంఖ్య 3,67,60,880గా ఉంది. సమగ్ర ప్రత్యేక సవరణ అనంతరం ఈసీ ప్రకటించిన తుది జాబితా 2019లో 3,69,33,091 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 116 నియోజకవర్గాల్లో ఓటర్లు పెరగ్గా, 59 చోట్ల తగ్గడం విశేషం. జిల్లాలవారిగా చూస్తే అత్యధికంగా 40,13,770 లక్షల ఓటర్లతో తూర్పుగోదావరిలో తొలిస్థానంలోనూ, అత్యల్పంగా 17,33,667 లక్షల ఓట్లతో విజయనగరం చిట్టచివరన నిలిచింది.

నియోజకవర్గాల పరంగా రంపచోడవరం అత్యధికంగా 1,04,475 ఓట్లు పెరిగితే, చిత్తూరు జిల్లా తిరుపతి నియోజకవర్గంలో అత్యధికంగా 53,286 ఓట్లు తగ్గాయి. తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కలిపి సుమారు 2.50 లక్షల మందిని వినియోగిస్తున్నారు. తెలంగాణలో జనవరి 1న ప్రకటించిన జాబితా ప్రకారం 2.95 కోట్లమంది ఓటర్లు ఉన్నారు. తాజాగా ఓటు నమోదు కోసం ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు మార్చి 15తో ముగిసింది. ఓటర్ల తుది జాబితాను మార్చి 25న ప్రకటించనున్నారు. తుది జాబితా ప్రకటన నాటికి ఓటర్ల సంఖ్య కాస్త అటూఇటూగా 2.98 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : notification for 2019 elections  Gopalakrishna Dwivedi  YSRCP  TDP  Jana Sena  BJP  AP politics  

Other Articles