SBI Yono App to allow cardless withdrawals ఎస్బీఐ ఏటీయంలలో ఇక కార్డు రహిత సేవలు..

Yono cash now sbi customers can get money from atm without card

sbi,sbi atm,sbi debit card,sbi yono,yono,yono cash,yono app,sbi atm cash withdrawal,cardless transactions,state bank of india

India’s largest bank State Bank of India (SBI) today announced the launch of YONO Cash using which customers can withdraw money from ATMs without using a card.

ఎస్బీఐ ఏటీయంలలో ఇక కార్డు రహిత సేవలు..

Posted: 03/16/2019 01:32 PM IST
Yono cash now sbi customers can get money from atm without card

ఏటిఎమ్‌ కార్డు లేకుండా ఏటిఎమ్‌  డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ ఏటిఎంలలో ఇటువంటి సౌకర్యం ఇప్పటికే అమల్లో ఉంది. అయితే ఏటిఎం కార్డు లేకుండా డబ్బులు తీసుకునే సౌకర్యం కూడా వుంటే బాగుండు అని అనుకుంటున్నారా..? తాజాగా ఈ అవకాశాన్ని కూడా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎస్బీఐ కల్పిస్తోంది. ఎస్బీఐ తమ డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఫ్లాట్ ఫామ్‌ యోనోపై ద్వారా ‘యోనో క్యాష్‌’ పేరుతో ఈ అవకాశాన్ని కలిగిస్తుంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వున్న కేవలం 16500 ఏటీయంలలో ఈ యోనో క్యాస్ సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చి కస్లమర్లకు అధునాతన అవకాశాన్ని కల్పిస్తున్న ఎస్బీఐ త్వరలోనే మరో 60 వేల ఏటీయం కేంద్రాలలో కూడా ఈ అవకాశాన్ని కల్పించనుంది. దీంతో ఆయా ఏటియం కేంద్రాలలో ‘యోనో క్యాష్‌’  యాప్ ద్వారా ఏటీయం కార్డు లేకుండా డబ్బును విత్ డ్రా చేసుకునే వెసలుబాటు కల్పిస్తుంది.

యాప్ ద్వారా డబ్బులు డ్రా చేయాలంటే ఈ విధానాన్ని పాటించాలి.

* ఈ యోనో యాప్ ను ముందుగా మీ మోబైల్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి
* ఆ యోనో యాప్‌కు ముందే ఒక ఆరు అంకెల సెక్యురిటీ పిన్ ను పెట్టుకోవాలి
* ఆ పిన్‌ను ఎంటర్ చేయగానే ఒకవేళ డబ్బు అకౌంట్ లో ఉంటే ఆరు అంకెల ఓటీపీ నంబర్ ను బ్యాంక్‌ అకౌంట్ కు లింక్ చేసిన నంబర్ కు పంపిస్తారు.
* ఆ ఓటీపీ ఎటిఎం కేంద్రాలలో ఎంటర్ చేసిన వెంటనే మనకు డబ్బు ఏటిఎమ్ నుండి వస్తుంది.
* ఓటీపీని 30నిమిషాలలో ఎంటర్ చేయవలసి ఉంటుంది. 30 నిమిషాలలో చేయకుండా ఓటీపీ ఎక్స్ పైరీ అయిపోతుంది

డెబిట్ కార్డుల ద్వారా చలామనిని తగ్గించాలనే ఆలోచనతో ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్‌బీఐ చెప్పింది. కార్డును జేబుల్లో పెట్టుకుని అవి పాడయితే ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీసుకోవడానికి కష్టం అవుతున్నదని ఇబ్బంది పడేవారికి ఈ నిర్ణయం మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇటువంటి సేవలను ఉపయోగించిన తొలి బ్యాంకు ఎస్బీఐ అని ఆ బ్యాంకు అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sbi  cardless transactions  sbi yono app  yono cash  sbi atm cash withdrawal  

Other Articles