YS Vivekananda Reddy's last rites completed ముగిసిన వైఎస్ వివేకానందరెడ్డి అంతిమ సంస్కారాలు

Ys vivekananda reddy s last rites completed at raja reddy ghat

YS Vivekananda Reddy murder, YS Vivekananda Reddy last rites, YS viveka Last rites, rajareddy ghat, pulivendula, YS Vivekananda Reddy killed, Seven stabings on ys vivekananda reddy body, YS Jaganmohan Reddy, Y. S. Rajasekhara Reddy, Kadapa district, jaganmohan reddy, Amaravati, Andhra Pradesh, Politics

The YSR Congress party leader and former minister YS Vivekananda Reddy's last rites have been completed at Raja Reddy ghat in Pulivendula of Kadapa district between a huge number of followers, party activists.

ముగిసిన వైఎస్ వివేకానందరెడ్డి అంతిమ సంస్కారాలు

Posted: 03/16/2019 12:42 PM IST
Ys vivekananda reddy s last rites completed at raja reddy ghat

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అశేషంగా తరలివచ్చిన అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల కన్నీటి మధ్యలో వైఎస్ వివేకానందకు తుది వీడ్కోలు పలికారు. పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఘాట్ లో క్రైస్తవ మతాచారం ప్రకారం వివేక బౌతికకాయాన్ని ఖననం చేశారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డిని కడసారి చూసేందుకు వైఎస్‌ కుటుంబ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

వివేకానందరెడ్డి నివాసం నుంచి రాజారెడ్డి ఘాట్‌ వరకు నిర్వహించిన అంతిమయాత్రలో వేలాది మంది అభిమానులతో పాటు వైఎస్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. భారీ భద్రత మధ్యలో జగన్ తన బాబాయి అంతమ యాత్రలో పాల్గొన్నారు. అశ్రునయనాలతో ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. ఆ సమయంలో వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కుటుంబ సభ్యులు ఆయన వెంట ఉన్నారు. కడసారి చూపుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు.

- 1950 ఆగస్టు 8న పులివెందులలో వివేకా జన్మించారు.
- వైఎస్ కు వివేకానందరెడ్డి చిన్న తమ్ముడు.
- ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివేకానందరెడ్డి పనిచేశారు.
- తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు.
- 1989, 1994లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
- 1999, 2004లో కడప పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా ఎన్నిక.
- 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు.
- 2010లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో వ్యయసాయశాఖ మంత్రిగా బాధ్యతలు.
- 2009లో సెప్టెంబర్‌లో ఉమ్మడి ఏపీలో మండలి సభ్యుడు.
- వివేకానందరెడ్డికి భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Vivekananda Reddy  last rites  rajareddy ghat  pulivendula  YS Jagan  Andhra pradesh  Politics  

Other Articles