Narrow Escape For Bangladesh Cricket Team నరమేథం నుంచి తృటిలో తప్పించుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు

Bangladesh cricket team escape christchurch mosque shooting

New Zealand, Christchurch shooting, bangladesh cricket team, BCB spokesperson, Jalal Yunus, christchurch mosque shooting, new zealand news, new zealand latest, world news, christchurch, mosque, newzealand, bangladesh cricket team, bangladesh cricket, mosque meaning, christchurch weather, jacinda ardern, christ church newzeland, christchurch new zealand, christchurch news, mosque meaning in hindi, nz news, nz herald, new zealand map, mosque shooting, christchurch time

Bangladesh's cricket team escaped unscathed after a shooting at a mosque in central Christchurch. Bangladesh Cricket Board spokesman Jalal Yunus said most of the team were bussed to the mosque and were about to go inside when the incident happened. "They are safe.

నరమేథం నుంచి తృటిలో తప్పించుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు

Posted: 03/15/2019 01:41 PM IST
Bangladesh cricket team escape christchurch mosque shooting

న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలో రెండు మసీదులపై దుండగులు జరిపిన కాల్పుల్లో తాజాగా అందిన సమాచారం ప్రకారం 49 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం పవిత్ర దినంగా భావించి ముస్లింలు అధిక సంఖ్యలో మసీదులకు వచ్చి ప్రార్థనలు చేసుకోవడం అనవాయితి. దీంతో మసీదులకు వచ్చే ముస్లింలను టార్గెట్ చేసుకుని ముష్కరులు ఈ కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల ఘటన నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తృటితో పెనుప్రమాదం తప్పించుకుంది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి వెల్లడించారు.

శుక్రవారం రోజును పురస్కరించుకుని న్యూజీల్యాండ్ లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో గల ఓ మసీదును సందర్శించిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు లోపలికి వెళ్తుండగా.. అదే సమయంలో మసీదులోంచి కాల్పులు మోత దద్దరిల్లిండంతో వెనక్కు తగ్గిన ఆటగాళ్లు.. మసీదులోకి వెళ్లకుండా అగిపోయారు. కాల్పుల శబ్దం వినబడటంతో ఆటగాళ్లు అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే కాకతాళీయంగా కాల్పులు జరిగే సమయంలో అక్కడే వున్నా.. ఆ తరువాత ముష్కరుల విద్రోహచర్యలు గురించి తెలిసిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు భయభ్రాంతులకు గురైయ్యారు.

కాగా, కాల్పుల ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆటగాళ్లు క్షేమంగా ఉన్నారని, అయితే, మానసికంగా కొంత షాక్‌కు గురయ్యారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి జలాల్ యూనస్ తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆటగాళ్లను హోటల్ రూములకు తరలించామని, పరిస్థితులు చక్కబడే వరకు హోటల్‌కే పరిమితం కావాలని కోరినట్టు చెప్పారు. కాగా కాల్పుల నేపథ్యంలో బంగ్లాదేశ్ న్యూజీలాండ్ పర్యటనను ఇరు దేశాల క్రికెట్ బోర్టులు విరమించుకున్నాయి.

ఈ ఘటనపై బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేస్తూ.. కాల్పుల నుంచి జట్టు సభ్యులందరం క్షేమంగా బయటపడినట్టు చెప్పాడు. ఈ ఘటనతో వణికిపోయామని, తమకోసం ప్రార్థనలు చేస్తుండాలని ట్వీట్ చేశాడు. మరో ఆటగాడు ముష్పికర్ రహీం ట్వీట్ చేస్తూ.. తమను అల్లానే రక్షించాడని పేర్కొన్నాడు. తాము చాలా అదృష్టవంతులమని, ఇటువంటి ఘటనను మరోమారు చూడాలనుకోవడం లేదని పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles