Mass shooting at Christchurch mosque న్యూజీలాండ్ నరమేథంలో 40 మంది మృతి..

Christchurch mosque shooting updates 40 killed says new zealand pm

New Zealand, Christchurch shooting, christchurch mosque shooting, new zealand news, new zealand latest, world news, christchurch, mosque, newzealand, bangladesh cricket team, bangladesh cricket, mosque meaning, christchurch weather, jacinda ardern, christ church newzeland, christchurch new zealand, christchurch news, mosque meaning in hindi, nz news, nz herald, new zealand map, mosque shooting, christchurch time

At least 49 people died and many were injured when Brenton Tarrant, a gunman went on a shooting spree in two mosques — Al Noor Mosque and Linwood Masjid during afternoon prayers — in Christchurch, New Zealand.

న్యూజీలాండ్ నరమేథంలో 40 మంది మృతి.. పోలీసుల అదుపులో నలుగురు

Posted: 03/15/2019 01:15 PM IST
Christchurch mosque shooting updates 40 killed says new zealand pm

న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలో రెండు మసీదులపై దుండగులు జరిపిన కాల్పుల్లో 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల నేపథ్యంలో ఎంతో ప్రశాంతంగా వుండే న్యూజిలాండ్ లోని క్రైస్ట చర్చ్ నగరం ఒక్కసారిగా భయకంపితమైంది. నగరవాసులు కాల్పుల కలకలం, అక్కడి మసీదుల్లో జరగిన నరమేధం వార్తలు తెలుసుకుంటూ భాయాందోళనకు గురవుతున్నారు. మసీదులకు వచ్చే భక్తులను టార్గెట్ చేసుకునే పక్కా ప్రణాళికతోనే ఈ కాల్పులకు జరిగాయి.

ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడని తెలియడంతో ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పందించారు. అతివాద భావజాలం కలిగిన టెర్రరిస్టు కాల్పులకు తెగబడ్డాడని చెప్పారు. దాడి చేసిన వ్యక్తి ఆస్ట్రేలియాలో జన్మించిన వ్యక్తి అని తెలిపారు. ఘటనపై న్యూజిలాండ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని... ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇంతకు మించి స్పందించలేనని చెప్పారు.

అనునిత్యం ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే న్యూజిలాండ్ పై ముష్కరమూకలు తెగబడ్డాయి.క్రైస్ట చర్చ్ నగరంలోని రెండు మసీదులను టార్గెట్ గా చేసుకన్న ఉగ్రవాదులు మసీదులకు వచ్చిన భక్తులను లక్ష్యాంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. ఒకేసారి క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదులలో ఈ కాల్పుల చోటుచేసుకోవడంతో సుమారు 40 మందికి పైగా మరణించారని, అనేక మంది గాయాపడ్డారని సమాచారం అందుతుంది. న్యూజిలాండ్ వాసులను ఈ కాల్పులు ప్రకంపనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి.

నరమేధాన్ని సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్

మసీదులో కాల్పులకు తెగబడిన సాయుధుడు కాల్పుల ఘటనను సోషల్ మీడియా ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో పలువురు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దుండగుడు మసీదులోకి వెళ్లడానికి ముందే సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ ప్రారంభించాడు. కారులో మసీదుకు చేరుకున్న నిందితుడు కారును బయట పార్క్ చేసి లోపలికి ప్రవేశించాడు. అతడి కారులో మారణాయుధాలు, పేలుడు పదార్థాలు, పెట్రోలు కేన్లు ఉన్నట్టు న్యూజిలాండ్ హెరాల్డ్ పేర్కొంది.

సాయుధుడు మసీదులోకి వెళ్లిన వెంటనే విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడని పత్రిక పేర్కొంది. 15 నిమిషాలపాటు కొనసాగిన లైవ్ స్ట్రీమింగ్ లో ఈ మొత్తం వ్యవహారం రికార్డు అయిందని పేర్కొంది. అయితే, ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అల్ నూర్ మాస్క్ లోకి ఆర్మీ దుస్తులు ధరించిన వ్యక్తి ఆటోమెటిక్ రైఫిల్ పట్టుకుని లోపలికి వెళ్లడం తాను చూశానని, అతడు లోపలికి వెళ్లిన వెంటనే తుపాకి ఆగకుండా మోగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

మసీదులకు ఎవరూ వెళ్లోద్దు: పోలీసుల హెచ్చరిక

మసీదులను టార్గెట్ చేసుకుని ముష్కరమూకలు నరమేధం సృష్టించిన నేపథ్యంలో, తమ పౌరులకు న్యూజిలాండ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్రైస్ట్ చర్చ్ లోని అన్ని పాఠశాలలను మూసివేయించారు. ప్రార్థనల కోసం ముస్లింలు ఎవరూ మసీదుల్లోకి వెళ్లవద్దని సూచించారు. నగరంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే... వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీస్ కమిషనర్ మికీ బుష్ ఆదేశాలు జారీ చేశారు.

మరోవైవు, కాల్పుల అనంతరం నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా మికీ బుష్ మాట్లాడుతూ, అన్ని కోణాల్లో తాము చర్యలు చేపట్టామని... క్రైస్ట్ చర్చ్ నగరమంతా అలర్ట్ ప్రకటించామని, ముష్కరులను పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. అయితే ప్రమాదం ముగిసి పోయిందని ఎవరూ భావించవద్దని... ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమీషనర్ సూచించారు.

దేశచరిత్రలో ఇది చీకటి రోజు: ప్రధాని

న్యూజిలాండ్ లోని ప్రముఖ నగరాల్లో ఒకటైన క్రైస్ట్ చర్చ్ లో రెండు మసీదులపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్ మాట్లాడుతూ, తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఇదొక చీకటి రోజు అని ఆమె అన్నారు. ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే శుక్రవారం రోజున ఈ ఘాతుకానికి పాల్పడిన ముష్కరులకు మానవత్వం లేదని, అలాగే మతం కూడా లేదని జసిండా ఆర్డెర్న్ వ్యాఖ్యానించారు. మతం పేరుతో మనుషులలో చిచ్చు రేపుతున్న ఉగ్రవాదాన్ని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించాలని అమె అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Christchurch shooting  mosque shooting  jacinda ardern  Terrorist attack  new zealand  Crime  

Other Articles