maoist letters in palnadu creates tension పల్నాడులో కలకలం రేపుతున్న మావోల లేఖలు..

Maoist letters to people in palnadu creates tension

Yarapathineni Srinivasa Rao, tdp mla yarapathineni, Maoists letter, Gurazala MLA, TDP MLA, YSRCP, Andhra Pradesh, Politics

Moaists letters creates tension in Guntur district, as they mention TDP leaders names in the letters. These letters were found near dachepally school of gurazala assembly constituency.

పల్నాడులో కలకలం రేపుతున్న మావోల లేఖలు..

Posted: 03/12/2019 05:04 PM IST
Maoist letters to people in palnadu creates tension

ఎన్నికలవేళ గుంటూరు జిల్లా పల్నాడులో మావోయిస్టుల పేరుతో లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ మాసంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును దారుణంగా హత్యచేసిన మావోలు.. మరోమారు సరిగ్గా ఎన్నికల వేళ లేఖలు ప్రత్యక్షం కావడంతో స్థానికులలో అందోళన రేకెత్తుతుంది. అవినీతి, భూకబ్జాదారులు, మైనింగ్ మాఫియావర్గాలు తమ పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు.

ఈ లేఖలలో కూడా మావోలు అధికార పార్టీకి చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని, నాయిబ్రాహ్మణ ఫెడరేషన్ ఛైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, దాచేపల్లి ఎంపీపీ నవకుమార్, టీడీపీ నేతలు మునగ నిమ్మయ్య, తంగెళ్ల శ్రీనివాసరావు, పగడాల భాస్కర్ లను హెచ్చరిస్తూ లేఖలు రాశారు. అవినీతి, భూకబ్జాదారులు మానుకొని.. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ లేఖలు దాచేపల్లి మోడ్రన్ స్కూల్ దగ్గర.. మావోయిస్టు పార్టీ పల్నాడు రీజనల్ కమిటీ పేరుతో ఈ లేఖలు వెలిశాయి.

మరోవైపు ఈ లేఖలపై యరపతనేని శ్రీనివాసరావు స్పందించారు. ఇవి మావోయిస్టుల లేఖలు కాదని.. నకిలీ లేఖల్ని విడుదల చేసి వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు. ఈ లేఖల వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని యరపతినేని డిమాండ్ చేశారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు గురజాల ఎమ్మెల్యే. అయితే ఎన్నికలవేళ మావోల పేరుతో లేఖ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ లేఖలపై ఆరా తీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles