YCP MLA denied entry into Lotus pond వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. లోటస్ పాండ్ లోకి నో ఎంట్రీ..

Ycp mla sunil denied entry into presidents house at lotus pond

YCP MLA Sunil, puthalapattu MLA Sunil, puthalapattu assembly constituency, chittoor district, YCP MLA denied entry into Jagan House, MLA sunil denied entry into Jagan house, YSRCP party President YS Jagan, 'YS Jagan's house Lotus pond, Andhra Pradesh, politics

YCP MLA Sunil from puthalapattu assembly constituency of chittoor district was denied entry into YSRCP party President YS Jagan's house at Lotus pond.

వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. లోటస్ పాండ్ లోకి నో ఎంట్రీ..

Posted: 03/12/2019 04:14 PM IST
Ycp mla sunil denied entry into presidents house at lotus pond

పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్‌కు చేదు అనుభవం ఎదురైంది. తమ పార్టీ అధినేత ఇంట్లోకి వెళ్లేందుకు ఎదురుచూసిన ప్రజాప్రతినిధి పడిగాపులకు పిలుపు రాకపోవడంతో.. ఆయన ఉసూరుమంటూ వెనుదిరిగాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు రెండు గంటలకు పైగా ఎదురుచూసిన సునీల్... చివరకు అక్కడి నుంచి నిరాశగా వెనుదిరిగారు. అయితే ఇది తొలి రోజు కాదు.. ఇలా గత మూడు రోజులుగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి.

తమ వైసీపీ పార్టీ అధినేత జగన్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సునీల్ కు... అపాయింట్ మెంట్ దక్కడం లేదని తెలుస్తోంది. రేపో మాపో పార్టీ అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో... తన టికెట్‌ సంగతి ఏంటని అడిగేందుకు సునీల్ లోటస్ పాండ్ లో ఉన్న తమ పార్టీ అధినేత జగన్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయనకు జగన్‌ అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదని తెలుస్తోంది.

మరోవైపు చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనను చూసినా... పట్టించుకోకపోవడంపై ఎమ్మెల్యే సునీల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో విజయం సాధించిన సునీల్‌కు ఈ సారి టికెట్ దక్కడం అనుమానమే అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... ఆయనకు వైసీపీ అధినేత అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంపై చర్చ మొదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YCP Mla  Sunil  Puthalapattu  YS Jagan House  lotus pond  Andhra pradesh  Hyderabad  politics  

Other Articles