How to check if your name is in the voter list ఓటరు లిస్టులో మీ పేరుందా.? చెక్ చేసుకోండిలా..!

Lok sabha elections 2019 how to check if your name is in the voter list

Voter list, voter list 2019, voter list name, voter list check, voter id, voter id list, name in voter list, election voter list, voter list search, voter search, voter list name check, check name in voter list, voter name search, how to check voter list, voter status, check your vote, election commission of India, name list, General elections, Assembly Elections

In order to cast your vote, all you need to have is voter identity card issued by the Election Commission of India with names on the electoral rolls. Therefore, it is important to check whether your name is present on the voter list or not ahead of the elections.

ఓటరు లిస్టులో మీ పేరుందా.? చెక్ చేసుకోండిలా..!

Posted: 03/12/2019 11:02 AM IST
Lok sabha elections 2019 how to check if your name is in the voter list

సార్వత్రిక ఎన్నికలకు వేళైంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా బాసిల్లుతున్న భారత దేశం త్వరలో తమ తమ నియోజకవర్గాల పరిధిలో పార్లమెంటు సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈ క్రమంలో దేశ వ్యప్తంగా సుమారు 90 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును వెల్లడించనున్నారు. దీంతో పాటు పలు రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కూడా ఎన్నుకునేందుకు రంగం సిద్దమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలును కూడా విడదల చేస్తూ మొత్తంగా ఏడు విడతలుగా ఎన్నికలను నిర్వహించేందుకు సిద్దమైంది.

ఈ నేపథ్యంలో ఫామ్ 7 వ్యవహారంతో పాటు, టీడీపీ సభ్యత్వ డేటా చౌర్యం కేసులపై రాష్ట్రంలోని అధికార విపక్షాల మధ్య ఎగసిపడుతున్న క్రమంలో ఈ వ్యవహారంపై రెండు పార్టీలు ఏకంగా హస్తినకు వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదులు చేయడం వరకు వెళ్లింది. దీంతో ఈ సమస్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో నని ఓటర్లు ఆందోళన పడుతుంటారు. తమ ఓటును చెక్ చేసుకోవాలని..ఒకవేళ లేకుంటే 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.

దీనికి సంబంధించి ఓటర్‌ హెల్ప్‌ లైన్‌ గా 1950 నంబర్ ను ఏర్పాటు చేశామని..ఈ నంబర్ కు కాల్‌ చేసి వారి వివరాలు చెప్పి ఓటు ఉందో? లేదో? తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఓటర్‌ హెల్ప్‌ లైన్‌, నా ఓట్‌, వాదా యాప్‌ ల నుంచి కూడా జాబితాలో పేరును చూసుకోవచ్చని, 'http://ceotelangana.nic.in', 'http://ceoandhrapradesh.nic.in' వెబ్ సైట్ లోనూ, ఆప్షన్‌ ను ఎంచుకుని ఓటును చెక్ చేసుకోవచ్చని తెలిపారు. దీంతో పాటు ఓటర్ల జాబితాలను బూత్ లెవల్ ఏజంట్ వద్ద అందుబాటులో ఉంచామని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles