vangaveeti radha krishna to join TDPచంద్రబాబు నివాసానికి వంగవీటి రాధా.. లగడపాటి మధ్యవర్తిత్వం..

Lagadapati mediates vangaveeti radha krishna to join tdp

vangaveeti radha krishna, General Elections 2019, TDP, BJP, YSRCP, Chandrababu, YS Jagan, Congress, Assembly Elections, Lagadapati Rajagopal, machilipatnam, vijayawada, Andhra Pradesh, Politics

Vijayawada reputed YSRCP leader vangaveeti radha krishna to join TDP, after ysrcp has rejected him in giving party ticket to contest for assembly elections

చంద్రబాబు నివాసానికి వంగవీటి రాధా.. లగడపాటి మధ్యవర్తిత్వం..

Posted: 03/12/2019 10:38 AM IST
Lagadapati mediates vangaveeti radha krishna to join tdp

విజయవాడ ప్రముఖ నాయకుడు వంగవీటి రాధా కృష్ణ టీడీపీలో చేరడం రమారమి ఖాయమైంది. ఇక కొందరు టీడీపీ నేతలు ఆయన చేరిక కేవలం లాంఛనంగానే మిగిలిందని పేర్కోంటున్నారు. వైసీపీ నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించి భగపడ్డ వంగవీటి రాధాకృష్ణ గత మూడు నాలుగు నెలలుగా రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ తీర్థం తీసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చినా.. తాను ప్రస్తతం తటస్థంగా వుంటానని, చెప్పిన వంగవీటి రాధా.. అన్ని పార్టీలలో తన తండ్రి రంగా అభిమానులు వున్నారని చెప్పారు.

కాగా, సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా షెడ్యూల్డు విడుదల కావడంతో అన్ని పార్టీలు వేగంగా పావులు కదుపుతూ తమ ఆదిపత్యాన్ని చాటుకుంటున్నాయి. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాధాను సోమవారం రాత్రి 12.30 తరువాత తర్వాత  చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకు వచ్చారు.  టీడీపీలో చేరిక పై రాధా చంద్రబాబు తో దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. వంగవీటి రాధాకు మచిలీపట్నం పార్లమెంట్ టికెట్ ఇచ్చే అవకాశాలను టీడీపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా అందుకు వంగవీటి సమ్మత్తిస్తారా.? లేదా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ కి రాజీనామా చేసిన రాధా చాలాకాలంగా టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతూ వస్తోంది.

వైసీపీ కి రాజీనామా చేసిన తర్వాత,   టీడీపీ లో చేరాలంటే విజయవాడలో సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న కొండప్రాంత వాసులకు ఇళ్లపట్టాలు మంజూరు చేయాలని రాధా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రాధా పలు ప్రెస్ మీట్ లలో కూడా అదే డిమాండ్ చేస్తూ వచ్చారు.  రాధా  డిమాండ్ చేసిన  కొన్నాళ్లకే ప్రభుత్వం  కొండ ప్రాంత వాసులకు ఇళ్లపట్టాలు మంజూరు చేసింది. దీంతో తన తండ్రి చివరి కోరికను తీర్చిన పార్టీగా టీడీపీ ఉంది కనుక తాను టీడీపీ లో చేరేందుకు సిధ్దమయ్యానని తన కార్యకర్తలకు చెప్పినట్లు తెలిసింది. ఏది ఏమైనా   చంద్రబాబు తో భేటీలో ఏఏ  అంశాలు ప్రస్తావించారు, రాజకీయంగా ఎటువంటి హామీలు లభించాయనేది తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles