JetBlue's 'All You Can Jet' Contest ఏడాది పాటు ఉచిత విమాన ప్రయాణం చేస్తారా..?

Jetblue s all you can jet contest requires empty instagram

Jet airlines, JetBlue's challenge, 'All You Can Jet' Contest, JetBlue's contest, 'All You Can Jet' Instagram, JetBlue's challenge Empty Instagram, JetBlue's contest Empty Instagram

Forget those calorie-laden all-you-can-eat buffets. JetBlue is hosting an “all-you-can” contest that promises to be way more fun for three winners. JetBlue’s “All You Can Jet” Sweepstakes has its own microsite.

ఏడాది పాటు ఉచిత విమాన ప్రయాణం చేస్తారా..?

Posted: 03/09/2019 11:11 AM IST
Jetblue s all you can jet contest requires empty instagram

‘జెట్ బ్లూ’ పౌరవిమాన సంస్థ తమ కస్టమర్లకు బ్రహ్మాండమైన ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ లో పాల్గోన్న లక్కీ విజేతలకు ఏడాది పాటు ఉచితంగా విమానయానం సేవలను అందించనుంది. అయితే ఇది ఆఫర్ మాత్రం కేవలం ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు మాత్రమే. ఎందుకంటే ఇన్ ష్టాగ్రామ్ యూజర్లు మాత్రమే ఈ పోటీలో పాల్గోనేందుకు అర్హులగా నిబంధనను పెట్టింది ఈ సంస్థ. ఈ పోటీలలో పాల్గోనే వారు తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లోని ఫోటోలను డిలీట్ చేయాల్సి వుంటుంది.

తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లోని అన్ని ఫొటోలను డిలీట్ చేస్తారో వారు ఏడాదిలో ఎన్నిసార్లైనా విమానంలో ఉచితంగా ప్రయాణం చేయొచ్చంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘ఆల్ యు జెట్’ అనే కార్యక్రమంలో ఎంపికయ్యే లక్కీ విన్నర్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఉన్న అన్ని ఫొటోలను డిలీట్ చేయడమే కాదు. ఆ తర్వాత ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ కస్టమైజ్డ్ ఫొటోను మీ అకౌంట్లోకి షేర్ చేసుకోవాలి. ఆ ఫొటో షేర్ చేసేప్పుడు #AllYouCanJetSweepStakes అని రాయాలి.

ఫొటోలు డిలీట్ చేస్తున్నామని మీరు అస్సలు బాధపడకండి. ఈ బంపర్ ఆఫర్ సాధిస్తే.. మీరు ఎక్కడెక్కడికి ప్రయాణిస్తారో ఆ ఫొటోలను పోస్ట్ చేసుకోవచ్చని విమానయాన సంస్థ వెల్లడించింది. శుక్రవారంన ఈ పోటీ ముగిసింది. మార్చి 11న విజేతలను ప్రకటిస్తారు. ఈ పోటీలో విజయం సాధించిన వారు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు జెట్ బ్లూ విమానాల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే, ఈ ఆఫర్ అమెరికా పౌరులకు మాత్రమే. వేరే దేశాలవారికి వర్తించదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BlueJet airlines  JetBlue  contest  Instagram  microsite  free travel  challenge  

Other Articles