Drug addict assaults minor girl, films her naked యువతిని వివస్త్రను చేసి.. ఒంటిపై బ్లేడుతో గాయాలు

Hyd girl stripped cut with blade on camera by drug addict

drug addicted gang rapes girl, girl striped and filmed in hyderabad, gril striped and raped gandhinagar, gandhinagar crime, Rape, assault, Hyderabad, Minor girl assaulted, Minor girl abused, Drug addict, Crime

A minor girl was allegedly stripped and her body cut with a blade by a drug addict in Hyderabad’s Gandhi Nagar on 7 March. The entire ordeal was also captured on camera by the perpetrator

యువతిని వివస్త్రను చేసి.. ఒంటిపై బ్లేడుతో గాయాలు

Posted: 03/09/2019 12:50 PM IST
Hyd girl stripped cut with blade on camera by drug addict

హైదరాబాద్ లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికను ఓ గ్యాంగ్ మత్తుమందుకు బానిసగా మార్చగా, అదే అదనుగా భావిచిన మరో గ్యాంగ్ ఆ బాలిక మత్తులో వుండగా అమెపై అత్యాచారానికి తెగబడింది. అంతేకాదు బాలికను వివస్త్రను చేస్తూ.. మొత్తం ఘటనను వీడియో తీసి.. దానినితో అమెను బ్లాక్ మెయిల్ చేసి మరీ అమెపై శారీరిక, మానసిక దాడికి, అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ రెండు గ్యాంగులకు చెందిన యువకుల మధ్య పెద్ద గొడవే జరిగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో గంజాయికి బానిసైన యువకులు కొందరు, తమతో పాటు మరో అమ్మాయికీ మత్తును అలవాటు చేశారు. ఇటీవల గంజాయి మత్తులో ఉన్న ఆమెను యువకులు వదిలి వెళ్లడంతో, ఆమెపై కన్నేసిన మరో బ్యాచ్ యువకుడు వచ్చి అమెపై అత్యాచారం చేశాడు. అందుకు సంబంధించిన దృశ్యాలను తన మోబైల్ లో చిత్రీకరించాడు.

వాటిని అడ్డుపెట్టుకుని మళ్లీ బాధితురాలని గాంధీనగర్ లోని నిర్జన ప్రాంతానికి రావాలని బెదిరించాడు. అయితే జరిగిన విషయాన్ని తన గ్యాంగ్ కు చెప్పిన యువతి వారిని వెంటబెట్టుకుని ఆ ప్రాంతానికి చేరకుంది. అయితే వారు చాలా సేవు వచి చూసి అక్కడే మళ్లీ మత్తుపదార్థులు తీసుకుని వెళ్లిపోయారు. ఈ క్రమంలో మరోమారు బాధితురాలు అక్కడూ వుండిపోయింది. ఈ అవకాశం కోసమే వేచి చూస్తున్న మరో గ్యాంగ్ ఒంటిరిగా వున్న బాధితురాలిని మళ్లీ వివస్త్రను చేసి అత్యాచారయత్నం చేసింది.

ఈ క్రమంలో తమతో పాటు వచ్చిన బాధితురాలు నిర్జన ప్రాంతం నుంచి తీసుకువద్దామని బయలుదేరిన యువకులు అమెపై మరో గ్యాంగ్ కు చెందిన యువకులు అత్యాచారానికి యత్నిస్తున్నండటం చూసి అరుస్తూ అక్కడికి చేరకున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఆ బ్యాచ్, ఆమెను బ్లేడ్ తో దాడి చేశారు. ఆపై వారు పరారవుతుండగా, కొందరిని పట్టుకున్న యువతి స్నేహితులు వారిని చితక కొట్టినట్టు తెలుస్తోంది.

 ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. ప్రేమ పేరుతో బాధితురాలిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడని, అమె నగ్న దృశ్యాలతో అమెపై గత మూడు నెలలుగా దారుణానిక పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసులో గంజాయి కానీ మత్తుపదార్థాల ఊసే లేదని కూడా పోలీసులు పేర్కోంటున్నారు. కాగా, యువతిని వివస్త్రను చేస్తున్న దృశ్యాలను మరో యువకుడు వీడియో తీయగా, అవి మీడియాకు చిక్కాయి.

 

 

 

 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rape  assault  Hyderabad  Minor girl assaulted  Minor girl abused  Drug addict  Crime  

Other Articles